- Telugu News Photo Gallery Cricket photos IPL 2025 Rohit Sharma, Suryakumar Yadav and Jasprit Bumrah may leave Mumbai Indians to play elsewhere due to this reason
IPL 2025: ఆ ముగ్గురి దెబ్బకు డిప్రెషన్‌లోకి ముంబై ఫ్రాంచైజీ.. వదులుకోలేరు, నిలుపుకోలేరు.. ఇదెక్కడి తలనొప్పి..
IPL 2025: ఈసారి IPL మెగా వేలానికి ముందు అన్ని ఫ్రాంచైజీలు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఇవ్వవచ్చు. కానీ, ఈ ఎంపిక కోసం కొంత మొత్తం నిర్ణయించనున్నారు. ఇందులో మొత్తం నలుగురిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది స్టార్ ప్లేయర్స్ ఉన్న ముంబై ఇండియన్స్ ఎవరిని రిటైన్ చేస్తుందనేది ఇప్పుడు క్యూరియాసిటీగా మారింది.
Updated on: Jul 24, 2024 | 12:02 PM

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-18 మెగా వేలానికి ముందు, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి కొత్త ఆందోళన మొదలైంది. దీనికి ప్రధాన కారణం జట్టులోని స్టార్ ప్లేయర్లే. అంటే ఈ ఆటగాళ్లను జట్టులో కొనసాగించడం ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ముందున్న అతిపెద్ద సవాలుగా మారింది.

ఎందుకంటే గత ఐపీఎల్ వేలం ద్వారా కొందరు ఆటగాళ్లు రూ.20 కోట్లకు పైగానే దక్కించుకున్నారు. కొంతమంది యువ ఆటగాళ్లకు రూ.15 కోట్లు దక్కాయి. అయితే, గత కొన్నేళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టులో కనిపిస్తున్న స్టార్ ప్లేయర్ల రెమ్యూనరేషన్ మాత్రం ఇప్పటికీ రూ.12 కోట్లు దాటలేదు. అందుకే ఈ మెగా వేలంలో పాల్గొనేందుకు ఈ ఆటగాళ్లు ఆసక్తి చూపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

సూర్యకుమార్ యాదవ్: టీ20 స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన సూర్యకుమార్ యాదవ్ 2018 నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. ముఖ్యంగా గత ఐదు సీజన్లలో అతడ్ని అట్టిపెట్టుకున్నారు. అయితే గత సీజన్‌లో అతనికి వచ్చిన మొత్తం రూ.8 కోట్లు మాత్రమే.

జస్‌ప్రీత్ బుమ్రా: 2013 నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న జస్‌ప్రీత్ బుమ్రా కూడా రూ. 15 కోట్లు చెల్లించారు. రూ. 20 కోట్లు చేరుకోకపోవడం విశేషం. ముఖ్యంగా గత రెండు సీజన్లలో బుమ్రా కేవలం 12 కోట్లు మాత్రమే దక్కాయి.

రోహిత్ శర్మ: ముంబై ఇండియన్స్ జట్టుకు విజయవంతమైన కెప్టెన్‌గా మారిన రోహిత్ శర్మ 2018లో రూ.15 కోట్లు సంపాదించాడు. అయితే గత 5 సీజన్లలో అతని జీతం కేవలం కోటి రూపాయలు మాత్రమే. అంటే ప్రస్తుతం ఆయన జీతం మొత్తం రూ.16 కోట్లు.

ఐపీఎల్ మెగా వేలానికి ముందు ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి కొంత మొత్తాన్ని నిర్ణయించారు. ఉదాహరణకు నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే మొదటి ఆటగాడికి రూ.16 కోట్లు, రెండో ఆటగాడికి రూ.12 కోట్లు, మూడో ఆటగాడికి రూ.8 కోట్లు, నాలుగో ఆటగాడికి రూ.4 కోట్లు షెడ్యూల్ చేయవచ్చు. కానీ ముంబై ఇండియన్స్ జట్టులో చాలా మంది స్టార్ ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి, ఏ ఆటగాడు తక్కువ మొత్తం పొందాలని కోరుకోడు అని చెప్పవచ్చు.

సూర్యకుమార్ యాదవ్ వేలంలో కనిపిస్తే కనీసం రూ.12 నుంచి 15 కోట్లకు బిడ్ కావడం ఖాయం. జస్ప్రీత్ బుమ్రా కొనుగోలు కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నట్లు కూడా ధృవీకరణ అయింది. అలా బుమ్రా మొత్తం రూ.20 కోట్లు దక్కించుకునే అవకాశం ఉంటుంది. రూ.16 కోట్లకు పైగా రోహిత్ శర్మను కొనుగోలు చేసేందుకు ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపడం ఖాయం.

ఇప్పుడు ఈ ముగ్గురిని ముంబై ఇండియన్స్ అట్టిపెట్టుకోవాలంటే వీరందరికీ భారీ మొత్తం చెల్లించాల్సిందే. ముఖ్యంగా రూ.8 కోట్లు, రూ.12 కోట్లు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా భారీ పారితోషికం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ఇద్దరినీ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎలా నిలుపుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.




