AB de Villiers: తండ్రి ఔటవడంతో కుర్చీని తన్నేసిన డివిలియర్స్ కొడుకు.. వైరల్‎గా మారిన వీడియో..

ఇండియాలో క్రికెట్ అంటే ఎవరికి ఇష్టముండదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు క్రికెట్ గురించి చర్చిస్తుంటారు. ఆ ఆటగాడు ఇలా కొడ్డాడు. ఈ ఆటగాడు అలా వికెట్ తీశాడని మాడ్లాడుకుంటారు...

AB de Villiers: తండ్రి ఔటవడంతో కుర్చీని తన్నేసిన డివిలియర్స్ కొడుకు.. వైరల్‎గా మారిన వీడియో..
Abdevilars Son
Follow us
Srinivas Chekkilla

| Edited By: Ravi Kiran

Updated on: Sep 27, 2021 | 3:15 PM

ఇండియాలో క్రికెట్ అంటే ఎవరికి ఇష్టముండదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు క్రికెట్ గురించి చర్చిస్తుంటారు. ఆ ఆటగాడు ఇలా కొడ్డాడు. ఈ ఆటగాడు అలా వికెట్ తీశాడని మాడ్లాడుకుంటారు. ముఖ్యంగా మ్యాచులు జరుగుతున్నప్పుడు. ఇక ఐపీఎల్ సిజన్ వచ్చిదంటే సాయంత్రి టీవీలకు అతుక్కు పోతుంటారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. ఐపీఎల్ 2021 సీజన్ క్రికెట్ లవర్స్‎కు బోలెడంత మజాను అందిస్తోంది. గ్రౌండ్‎లోనే కాకుండా ఆన్ ఫీల్డ్ మూమెంట్స్ కూడా అభిమానుల్ని అలరిస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ప్రస్తుతం వైరలవుతోంది. ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు 54 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఇక, ఆర్సీబీ అనగానే మనకు ముందు గుర్తుకు వచ్చేది.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‎లే. ఎదుకంటే జట్టు విజయాల్లో వీళ్లే కీలక పాత్ర పోషించారు. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ ఏబీడీకి అయితే.. భారత్‎లో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అతని విధ్వంసకర బ్యాటింగ్‎ను చూడడానికి పోటీపడతారంటే అతిశయోక్తి కాదు.

ఐపీఎల్-2021 రెండో దఫాలో ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండింటిలో విజయం సాధించింది. ఈ మూడు మ్యాచ్‎లో ఏబీ డివిలియర్స్ పెద్దగా బ్యాట్ ఝుళిపించలేదు. వరుసగా విఫలమవుతున్న అతడి ఆటతీరుపై ఆ జట్టు అభిమానులతో పాటు ఏబీ కొడుకు కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిన్న జరిగిన పోరును చూసేందుకు డివిలియర్స్ భార్య, కొడుకు వచ్చారు. అయితే జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్‎లో మిస్టర్ 360 ఔటవ్వగానే అతడు కోపంతో కుర్చీని గట్టిగా తన్నాడు అతని కొడుకు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

ఇదీ చదవండి:  IPL-2021: ఊపుమీద ఉన్న ఢిల్లీ, చెన్నై.. వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్లు..

IPL Points Table 2021: ఐపీఎల్‌ పాయింట్ల జాబితాలో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది.? ఆరెంజ్ క్యాప్‌ రేసులో ఎవరు ముందున్నారు?