IPL-2021: ఊపుమీద ఉన్న ఢిల్లీ, చెన్నై.. వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్లు..

ఐపీఎల్-2021లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. రెండో దశలో ఆడిన మూడు మ్యాచ్‎ల్లో చెన్నై విజయం సాధించింది. ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచ్‎ల్లో గెలుపొందింది. రెండూ జట్లు 10 పాయింట్లతో ఉండగా మెరుగైన నెట్ రన్ రేటుతో సూపర్ కింగ్స్...

IPL-2021: ఊపుమీద ఉన్న ఢిల్లీ, చెన్నై.. వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్లు..
Chennai Super Kings And Delhi Capitals Consecutive Victories In Ipl 2021
Follow us
Anil kumar poka

|

Updated on: Sep 27, 2021 | 11:23 AM

ఐపీఎల్-2021లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాయి. రెండో దశలో ఆడిన మూడు మ్యాచ్‎ల్లో చెన్నై విజయం సాధించింది. ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచ్‎ల్లో గెలుపొందింది. రెండూ జట్లు 10 పాయింట్లతో ఉండగా మెరుగైన నెట్ రన్ రేటుతో సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానంలో క్యాపిటల్స్ ఉంది. సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్‎తో తలపడిన చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. లక్ష్యఛేధనకు దిగిన ముంబై 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 136 పరుగులే చేసింది.

సెప్టెంబర్ 24న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‎లో ఆరు వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించింది. మొదట బ్యాంటిగ్ చేసిన బెంగళూరు ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన సూపర్ కింగ్స్ 11 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. నిన్న కోల్‎కత్తా‎ నైట్ రైడర్స్‎తో జరిగిన మ్యాచ్‎లో చెన్నై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదటగా బ్యాంటింగ్ చేసిన కోల్‎కత్తా 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్‎కు దిగిన చెన్నై ఎమిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ కింగ్స్ ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఐపీఎల్-2021 మొదటి దశలో ఆడిన ఏడు మ్యాచ్‎ల్లో ఐదింటిలో విజయం సాధించింది చెన్నై.

రెండో దశలో రెండు మ్యాచ్‎లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ రెండింటిలోనూ గెలుపొందింది. సెప్టెంబర్ 22న సన్‎రైజర్స్ హైదరాబాద్‎తో జరిగిన మ్యాచ్‎లో ఢిల్లీ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 134 పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్‎కు దిగిన క్యాపిటల్స్ 13 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది. సెప్టెంబర్ 25న రాజస్తాన్ రాయల్స్‎తో జరిగిన మ్యాచ్‎లో ఢిల్లీ 33 పరుగులు తేడాతో గెలుపొందింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్-2021 మొదటి దశలో ఆడిన ఎనిమిది మ్యాచ్‎ల్లో ఆరింటిలో విజయం సాధించింది.

మరిన్ని చదవండి ఇక్కడ : Bigg Boss 5 Telugu: నన్ను ప్రేమించిన వాడు అర్థాంతరంగా చనిపోయాడు.. ఏడ్చేసిన సిరి..(వీడియో)

 Viral Video: ఆత్మకూరులో 65ఏళ్ల వృద్ధుడి సహసం.. ఒంటి చేత్తో గుర్రం సవారీ.. వైరల్ అవుతున్న వీడియో..

 Covid Effect Video: కోవిడ్‌ నుంచి కోలుకున్నవారికి పిడుగులాంటి వార్త..! స్పష్టం చేసిన నిపుణులు..(వీడియో)

 police counceling Video: పోకిరీల తాట తీస్తున్న పోలీసులు..! స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్‌ ఇచ్చిన పోలీసులు..(వీడియో)

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే