- Telugu News Sports News Cricket news IPL Points Table 2021 Standings ranking orange cap purple cap after kkr And csk
IPL Points Table 2021: ఐపీఎల్ పాయింట్ల జాబితాలో ఏ జట్టు ఏ స్థానంలో ఉంది.? ఆరెంజ్ క్యాప్ రేసులో ఎవరు ముందున్నారు?
IPL Points Table 2021: ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్ రసవత్తరంగా మారుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ విజయ పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే 10 మ్యాచ్‌లో గెలిచి..
Updated on: Sep 27, 2021 | 10:09 AM

ఐపీఎల్ 2021 సెకండ్ ఎడిషన్ రసవత్తరంగా కొనసాగుతోంది. జట్లు నువ్వా నేనా.. అన్నట్లు పోటీ పడుతున్నాయి. తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

దీంతో ఐపీఎల్ 2021 పాయింట్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ మొదటి స్థానంలో నిలిచింది. 10 మ్యాచ్‌లో గెలిచి 16 పాయింట్లతో అగ్ర స్థానంలో నిలిచింది.

తర్వాత స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. ఈ జట్టు కూడా 10 మ్యాచ్‌లలో 16 పాయింట్లు దక్కించుకుంది. కానీ నెట్ రన్ రేట్‌లో వెనుకబడడంతో రెండో స్థానానికి పరిమితమైంది.

ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 పాయింట్లతో మూడో స్థానంలో నిలవగా, కోల్‌కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక పంజాబ్ ఎనిమిది పాయింట్లతో ఐదో స్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ వరుసగా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచింది. ఇక జాబితాలో చివరి స్థానంలో హైదరాబాద్ నిలిచింది.

ఆరెంజ్ క్యాప్ రేస్ విషయానికొస్తే శిఖర్ ధావన్ ప్రస్తుతం 10 స్థానాల్లో 430 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ (401) ఉన్నాడు.

ఇక పర్పుల్ క్యాప్ రేస్‌లో ఆర్‌సీబీకి చెందిన బౌలర్ హర్షల్ పటేల్ 23 వికెట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో ఢిల్లీకి చెందిన అవేష్ ఖాన్ 15 వికెట్లతో ఉన్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన క్రిస్ మోరిస్ 14 వికెట్లతో 3వ స్థానంలో ఉన్నాడు.





























