Viral News: ముంబై వాంఖేడే స్టేడియం.. ఓ మనిషి ఈగోతో కట్టారని తెలుసా.? ఆకస్తికర విషయాలు మీకోసం..
బ్రబౌర్న్ స్టేడియంని 1930లలో నిర్మించారు. అప్పట్లో ఇది ప్రతిష్టాత్మక క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI) లో భాగంగా ఉంది. ఈ స్టేడియం ఒక రకంగా లార్డ్స్ స్టేడియం ఆఫ్ ఇండియా కూడా పరిగణించే వారు. చక్కటి ప్రణాళికతో స్టేడియం నిర్మించడమే కాకుండా అద్భుతంగా ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే వారు. స్వాతంత్ర్యం తరువాత, బ్రబౌర్న్ స్టేడియంలో భారతదేశం పాల్గొన్న చాలా టెస్ట్ మ్యాచ్‌లకు వేదిక అయ్యింది. బాంబే క్రికెట్ అసోసియేషన్ (BCA), CCI సీట్ల కేటాయింపుతో పాటు స్టేడియం నుంచి వచ్చే ఆదాయానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి...
స్టేడియంలు అవసరాల కోసం నిర్మిస్తారు. కానీ భారతదేశంలో ఒక స్టేడియం కథ మాత్రం విచిత్రంగా ఉంటుంది. అవసరం కోసమో, భవిష్యత్తు కోసమో పుట్టిన స్టేడియం కాదు అది.. ఒక మనిషి ఈగోకు పుట్టిన స్టేడియం. ఆ స్టూడియో ఏంటి దాని కథ ఏంటి అని అనుకుంటున్నారా. ముంబై నగరం మరేం డ్రైవ్ కి వెళ్ళిన వారికి ఎవరైనా రెండు స్టేడియంలో కనిపిస్తూ ఉంటాయి. రెండు స్టేడియంలో పెద్దగానే ఉంటాయి.. కానీ రెండు స్టేడియంలో పక్కపక్కనే ఎందుకు కట్టారు అని ఆలోచన అక్కడున్న వారికి కలుగుతుంది. దానికో పెద్ద కథే ఉంది.
బ్రబౌర్న్ స్టేడియంని 1930లలో నిర్మించారు. అప్పట్లో ఇది ప్రతిష్టాత్మక క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (CCI) లో భాగంగా ఉంది. ఈ స్టేడియం ఒక రకంగా లార్డ్స్ స్టేడియం ఆఫ్ ఇండియా కూడా పరిగణించే వారు. చక్కటి ప్రణాళికతో స్టేడియం నిర్మించడమే కాకుండా అద్భుతంగా ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే వారు. స్వాతంత్ర్యం తరువాత, బ్రబౌర్న్ స్టేడియంలో భారతదేశం పాల్గొన్న చాలా టెస్ట్ మ్యాచ్‌లకు వేదిక అయ్యింది. బాంబే క్రికెట్ అసోసియేషన్ (BCA), CCI సీట్ల కేటాయింపుతో పాటు స్టేడియం నుంచి వచ్చే ఆదాయానికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటి వరకు కథ బానే ఉంది.
అయితే 1960ల చివరలో BCA మరిన్ని టిక్కెట్లు కేటాయించమని CCIని కోరింది. ఈ ప్రతిపాదన ను సీసీఐ నిర్మొహమాటంగా నిరాకరించింది. దీంతో BCA vs CCI గా యుద్ధం ప్రారంభమైంది. BCA అప్పటి కాంగ్రెస్ రాజకీయ నాయకుడు SK వాంఖడే ఆధ్వర్యంలో ఉంది. CCI క్రికెటర్ విజయ్ మర్చంట్ ఆధ్వర్యంలో ఉండేది. ఇద్దరు సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ ఆశించారు. కానీ ఇరువర్గాలు గట్టిగా తమ డిమాండ్స్ వైపు మొగ్గు చూపాయి.. ఈ వివాదం బొంబాయి లో అప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయతే BCA ను నడుపుతున్న రాజకీయ నాయకుడు SK వాంఖడే కు చిరెత్తకొచ్చింది.. వాళ్లపై ఆధారపడి డబ్బులు అడ్డుకోవడం ఎంటి భావించాడు. ఇంకా ఏం ఉంది కొత్త స్టేడియం కట్టాలని అలోచలన వచ్చింది. ఆర్థికంగా భారమైనప్పటికీ, ఇది తప్పుడు నిర్ణయం మన అందరూ చెబుతున్నప్పటికీ.. కొత్త స్టేడియం కట్టడం వైపే మగ్గుచూపారు వాంఖడే.
వాంఖడే స్టేడియం సరిగ్గా బ్రబౌర్న్ స్టేడియం పక్కనే ప్రారంభించారు కానీ ఇది పూర్తి కావడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ వాంఖడే మాత్రం కట్టి చూపించాడు. బ్రబౌర్న్ స్టేడియం పక్కన ఒక స్టేడియం నిర్మించడానికి అనుమతి పొందాడు. స్వతగా రాజకీయ నాయకుడు కాబట్టి అన్ని అనుమతులు త్వరగా తెచ్చుకోగలిగారు. అప్పట్లో పెద్ద పెద్ద బిల్డర్లకే సిమెంట్ దొరకడం కష్టంగా ఉన్న రోజుల్లో స్టేడియం నిర్మాణం కోసం సిమెంట్ కూడా ఆయన స్వయంగా సమకూర్చారు. అదరపు ఖర్చులకు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని విషయాలు తెలియనప్పటికీ స్టేడి అని మాత్రం వేగంగా పూర్తి చేసి 1975లో స్టేడియం అందుబాటులో తీసుకొని వచ్చారు..ఇక ఈ స్టేడియం వచ్చిన తర్వాత బ్రబౌర్న్ స్టేడియం వెలవెలబోయింది. ఇప్పటికి వంకడి స్టేడియం భారతదేశ చరిత్రలో ఒక బెస్ట్ స్టేడియం గా పరిగణిస్తారు. కానీ లోతుగా పరిశీలిస్తే ఇది ఒక మనిషి ఈగో వల్ల ఏర్పడ్డ స్టేడియం గా కూడా కొందరు చూస్తూ ఉంటారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..