AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranji Trophy 2024: ఒకేసారి 5మంది క్రికెటర్ల వీడ్కోలు.. లిస్టులో ధోని చేరదీసిన ప్లేయర్ కూడా

రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు 5 మంది ఆటగాళ్లు క్రికెట్‌కు రిటైరయ్యారు. వీరంతా గతంలో భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినవారే. రంజీ ట్రోఫీ లీగ్ దశ ముగియడంతో రిటైర్మెంట్ ప్రకటించిన ఐదుగురు ఆటగాళ్లలో బెంగాల్ దిగ్గజ ఆటగాడు...

Ranji Trophy 2024: ఒకేసారి 5మంది క్రికెటర్ల వీడ్కోలు.. లిస్టులో ధోని చేరదీసిన ప్లేయర్ కూడా
Team India Cricketers
Basha Shek
|

Updated on: Feb 20, 2024 | 12:57 PM

Share

ఓ వైపు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆడుతోంది టీమిండియా. మరోవైపు దేశవాళీ టోర్నీ రంజీ క్రికెట్ సీజన్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఇందులో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన స్టార్ క్రికెటర్లు తమ తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. అయితే కొంతమంది స్టార్ క్రికెటర్లకు ఇదే చివరి సీజన్. రంజీ ట్రోఫీలో ఇప్పటి వరకు 5 మంది ఆటగాళ్లు క్రికెట్‌కు రిటైరయ్యారు. వీరంతా గతంలో భారత జట్టు తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడినవారే. రంజీ ట్రోఫీ లీగ్ దశ ముగియడంతో రిటైర్మెంట్ ప్రకటించిన ఐదుగురు ఆటగాళ్లలో బెంగాల్ లెజెండ్ మనోజ్ తివారీ, జార్ఖండ్ బ్యాట్స్‌మెన్ సౌరభ్ తివారీ మరియు ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్, ముంబైకి చెందిన ధవల్ కులకర్ణి, విదర్భ రంజీ ట్రోఫీ విజేత కెప్టెన్ ఫైజ్ ఫజల్ ఉన్నారు. బెంగాల్‌కు చెందిన మనోజ్ తివారీ బీహార్‌పై తన జట్టును విజయపథంలో నడిపించిన తర్వాత తన కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల మనోజ్ తన రాష్ట్రం తరఫున 19 ఏళ్లుగా ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 10,000కు పైగా పరుగులు చేసిన మనోజ్ గత సీజన్‌లో బెంగాల్‌ను రంజీ ట్రోఫీ ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు.జార్ఖండ్ తరఫున 17 ఏళ్ల పాటు ఆడిన సౌరభ్ తివారీ 115 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 22 సెంచరీలు, 34 అర్ధసెంచరీలతో సహా 8030 పరుగులు చేశాడు.

తన రిటైర్మెంట్‌పై ప్రకటన విడుదల చేసిన సౌరభ్.. ‘జాతీయ జట్టులో లేదా ఐపీఎల్‌లో అవకాశం లభించని తర్వాత యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి ఇదే సరైన సమయమని నేను నమ్ముతున్నాను. టీమ్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఒకప్పుడు సంచలనాలు సృష్టించాడు వరుణ్ ఆరోన్. అయితే గాయాల కారణంగా తన కెరీర్‌లో ఎక్కువ కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వరుణ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 66 మ్యాచ్‌లు ఆడి 173 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడీ ఫాస్ట్‌ బౌలర్‌ కూడా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. 21 ఏళ్ల పాటు విదర్భ తరఫున ఆడిన ఫైజ్ ఫజల్ 2018లో రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా జట్టును గెలిపించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫైజ్ ఫజల్ 9183 పరుగులు చేశాడు. ఇప్పుడీ స్టార్‌ ప్లేయర్‌ కూడా ఆటకు గుడ్‌ బై చెప్పాడు. టీమ్ ఇండియా, ఐపీఎల్ రెండింటిలోనూ తన స్వింగ్ బౌలింగ్ తో సంచలనం సృష్టించిన 35 ఏళ్ల ధవల్ కులకర్ణి ఇప్పుడు తన 17 ఏళ్ల ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 95 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ధావల్ 281 ​​వికెట్లు తీశాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by MANOJ TIWARY (@mannirocks14)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..