Farhan Ahmed : అన్నకు తగ్గ తమ్ముడు.. టీ20లో హాట్రిక్, ఒకే మ్యాచ్ లో 5 వికెట్లు!
17 ఏళ్ల స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ టీ20 బ్లాస్ట్‌లో లంకాషైర్‌పై హ్యాట్రిక్, 5 వికెట్లు తీసి తన జట్టు నాటింగ్‌హామ్‌షైర్‌కు విజయాన్ని అందించాడు. రెహాన్ అహ్మద్ తమ్ముడైన ఫర్హాన్, నాటింగ్‌హామ్‌షైర్ తరఫున టీ20లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆటగాడిగా అతడు నిలిచాడు.

Farhan Ahmed : టీ20 బ్లాస్ట్ 2025 లో పాకిస్థాన్ మూలాలున్న 17 ఏళ్ల యువ స్పిన్నర్ ఫర్హాన్ అహ్మద్ అదరగొట్టాడు. లంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుతమైన హ్యాట్రిక్ తీసి తన జట్టు నాటింగ్‌హామ్‌షైర్‌కు విజయాన్ని అందించాడు. అతని బౌలింగ్‌ను బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోలేకపోయారు. టీ20 క్రికెట్‌లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున హ్యాట్రిక్ తీసిన మొదటి ఆటగాడిగా ఫర్హాన్ నిలిచాడు. లంకాషైర్‌పై ఈ మ్యాచ్‌లో అతను మొత్తం ఐదు వికెట్లు తీసి, తన జట్టుకు 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ కు ఫర్హాన్ తమ్ముడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లంకాషైర్ 20 ఓవర్లలో 126 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫర్హాన్ అహ్మద్ స్పిన్ బంతులు లంకాషైర్ బ్యాట్స్‌మెన్‌లను బాగా ఇబ్బంది పెట్టాయి. లంకాషైర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఫర్హాన్ వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
127 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన నాటింగ్‌హామ్‌షైర్ 16 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి గెలిచింది. ఆరంభంలో నాటింగ్‌హామ్‌షైర్ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ, టామ్ మూర్స్ 75 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.
ఫర్హాన్ అహ్మద్ ఎవరు? ఫర్హాన్ అహ్మద్ 17 ఏళ్ల యువ స్పిన్నర్. అతను ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడే రెహాన్ అహ్మద్ కి తమ్ముడు. ఫర్హాన్ 2024 అండర్-19 ప్రపంచ కప్‌లో కూడా ఆడాడు. గతేడాది నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడిన అతి చిన్న వయసు ఆటగాడిగా, ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన అతి చిన్న వయసు బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




