Hardik Pandya: వీరిద్దరూ నేటి కాలపు గొప్ప ఆల్ రౌండర్లు.. దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ క్లూసెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ భారత క్రికెటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హర్థిక్ పాండ్యాతో పాటు ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లాండ్ కు చెందిన..
దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెనర్ భారత క్రికెటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా హర్థిక్ పాండ్యాతో పాటు ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంగ్లాండ్ కు చెందిన బెన్ స్టోక్స్, భారత్ కు చెందిన హర్దిక్ పాండ్యా అనే ఈ ఇద్దరు ఆధునిక-కాలపు గొప్ప ఆల్ రౌండర్లు అంటూ కితాబిచ్చాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో మణిపాల్ టైగర్స్ తరపున క్లూసెనర్ ఆడుతున్నాడు. అయితే లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడుతున్న క్లూస్ నెర్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బెన్ స్టోక్స్, హార్థిక్ పాండ్యాతో పాటు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు అక్టోబర్ నెలలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా అవకాశాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హార్థిక్ పాండ్యా, బెన్ స్టోక్స్ తో పోల్చినప్పుడు బెన్ స్టోక్స్ కొంత ముందుంటాడని భావిస్తున్నట్లు చెప్పాడు. గతంలో పోలిస్తే హార్థిక్ పాండ్యా ఆటతీరు ఎంతో మెరుగుపడిందని ప్రశంసించాడు. ఎక్కువ ఓవర్లు నిలకడగా ఆడటమే హార్థిక్ పాండ్యా ఆటలో మెరుగుదల అని అనుకుంటున్నట్లు తెలిపాడు. వైట్ బాల్ క్రికెట్ లో నాలుగు ఓవర్ల పూర్తి కోటాను నిలకడగా బౌలింగ్ చేయడంతో పాటు అతని బ్యాటింగ్ అద్భుతమని పొగడ్తలతో ముంచెత్తాడు. హార్థిక్ పాండ్యా తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకోగలడని, దానికి కావల్సిన సమయం కూడా ఉందని క్లూసెనర్ వ్యాఖ్యానించారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పై క్లూస్ నెర్ మాట్లాడుతూ.. తాను స్వయంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి ఆడలేదని, బయటి నుండి వారి ఆటతీరును చూస్తున్నానని తెలిపారు. వారిద్దరిపై తనకు గొప్ప గౌరవం ఉందని, ఇద్దరూ కెప్టెన్‌లుగా విజయవంతమయ్యారన్నారు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీని తాను ఇష్టపడతాని అన్నారు క్లూస్ నెర్. కెప్టెన్ ఎవరనే దానికంటే కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ అద్భత ప్రదర్శనను కొనసాగించినంత కాలం భారత క్రికెట్ జట్టు మంచి స్థానంలో ఉంటుందన్నారు.
భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ గురించి క్లూస్ నెర్ మాట్లాడుతూ.. సీనియర్ జట్టుకు కోచ్ గా పనిచేయడానికి ముందు భారత్ ఎ, అండర్-19 జట్టుకు కోచ్ గా ఉన్నారని, నేషనల్ క్రికెట్ అకాడమీకి సారధ్యం వహించారని, రాహుల్ ద్రవిడ్ శిక్షణలో భారత్ జట్టు ర్యాకింగ్ లో మంచి స్థానంలో ఉందని తన అలభిప్రాయంగా చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ గురించి తన అభిప్రాయాన్ని చెబుతూ.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఫైనల్స్ ఆడాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..