Asian Games: ఆసియా గేమ్స్‌లో సత్తా చాటిన భారత హాకీ ప్లేయర్స్‌.. ఉజ్బెకిస్తాన్‌పై భారీ విజయం

మన్‌దీప్ సింగ్‌ మూడు గోల్స్‌ చేసి సత్తా చాటాడు. అభిషేక్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌ అమిత్‌ రోహిదాస్‌, సంజయ్‌ ఒక్కో గోల్‌ చేశారు. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ మంగళవారం సింగపూర్‌తో జరిగే మ్యాచ్‌లో తలపడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్ లేకపోయినా భారత హాకీ జట్టు చెలరేగి ఆడింది. తొలి క్వార్టర్‌లో లలిత్‌, వరుణ్‌లు 2-0 అధిక్యంతో నిలిచారు. అనంతరం అభిషేక్‌...

Asian Games: ఆసియా గేమ్స్‌లో సత్తా చాటిన భారత హాకీ ప్లేయర్స్‌.. ఉజ్బెకిస్తాన్‌పై భారీ విజయం
Asian Games 2023
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 24, 2023 | 1:08 PM

భారత హాకీ జట్టు విశ్వరూపం చూపించింది. పూల్‌ ఏ ప్రిలిమనీ రౌండ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చైనాలోని హాంగ్‌జో వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత హాకీ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఏకంగా 16-0 తేడాతో ఉజ్బెకిస్తాన్‌పై అనూహ్య విజయాన్ని నమోదు చేసుకుంది. ముగ్గురు భారత ఆటగాళ్లు హ్యాట్రిక్స్‌ సాధించారు. అలాగే లలిత్‌ ఉపాధ్యాయ్‌, వరుణ్‌ కుమార్‌ చెరో నాలుగు గోల్స్‌ చేయడం విశేషం.

మన్‌దీప్ సింగ్‌ మూడు గోల్స్‌ చేసి సత్తా చాటాడు. అభిషేక్‌, సుఖ్‌జీత్‌ సింగ్‌ అమిత్‌ రోహిదాస్‌, సంజయ్‌ ఒక్కో గోల్‌ చేశారు. ఈ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్‌ మంగళవారం సింగపూర్‌తో జరిగే మ్యాచ్‌లో తలపడనుంది. రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ సింగ్ లేకపోయినా భారత హాకీ జట్టు చెలరేగి ఆడింది. తొలి క్వార్టర్‌లో లలిత్‌, వరుణ్‌లు 2-0 అధిక్యంతో నిలిచారు. అనంతరం అభిషేక్‌, మన్‌దీప్‌లు 4-0తో స్కోరు సాధించారు. ఇక రెండో క్వార్టర్‌లోనూ భారత్‌ ఆధిక్యంలో నిలిచింది. ఆపై సుఖ్‌జీత్, మన్‌దీప్‌ జోడి కట్టడంతో భారత్‌ 6-0తో అధిక్యంలో నిలిచింది.

ఇక మన్‌దీప్ తన హ్యాట్రిక్‌ను పూర్తి చేసి హాఫ్-టైమ్‌కు 7-0తో నిలిచాడు. మూడో క్వార్టర్‌లో, వరుణ్ పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మార్చాడు అలాగే మూడో క్వార్టర్‌లో 8-0తో తన బ్రేస్‌ను పూర్తి చేశాడు. ఆ తర్వాత సుఖ్‌జీత్‌, రోహిదాస్‌ మరిన్ని గోల్స్‌ చేసి 10-0తో భారత్‌ స్కోర్‌ రెండంకెలకు చేరింది. మూడో క్వార్టర్‌లో సుఖ్‌జీత్ తన బ్రేస్‌ను పూర్తి చేశాడు, అలాగే షంషేర్ కూడా తన మొదటి గోల్‌ని సాధించాడు. దీంతో భారత్‌ మూడవ క్యార్టర్‌ను 12-0తో ఆధిక్యంతో ముగించింది. ఆ తర్వాత చివరి క్వార్టర్‌లో వరుణ్‌ తన మూడు, నాలుగో గోల్‌లు చేయడంతో భారత్ 14-0తో ఆధిక్యంలో నిలిచింది. లలిత్ తన నాలుగో గోల్‌ను కూడా సాధించి 15-0తో సమం చేశాడు. లలిత్ నాలుగో గోల్ తర్వాత సంజయ్ మ్యాచ్‌లో తన మొదటి గోల్‌ను అందుకున్నాడు. దీంతో భారత్‌ 16-0తో భారత్‌ అద్భుత విజయాన్ని అందుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!