Asian Games: ఆసియా క్రీడల్లో ఫైనల్ చేరిన భారత్.. బంగ్లాపై ఘన విజయంతో పతకం పక్కా..

Asian Games Womens T20I, India Women vs Bangladesh Women, Semi Final 1: బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయంతో భారత మహిళల క్రికెట్ జట్టు ఆసియా క్రీడలు 2023లో ఫైనల్‌కు చేరుకుంది. సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్-శ్రీలంక జట్లు తలపడనుండగా, గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్లో స్వర్ణం కోసం పోరాడుతుంది.

Asian Games: ఆసియా క్రీడల్లో ఫైనల్ చేరిన భారత్.. బంగ్లాపై ఘన విజయంతో పతకం పక్కా..
India Women Vs Bangladesh Women
Follow us

|

Updated on: Sep 24, 2023 | 12:58 PM

Asian Games Womens T20I, India Women vs Bangladesh Women, Semi Final 1: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో మహిళల టీ20లో భారత క్రికెట్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించింది. పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో స్మృతి మందన సారథ్యంలోని భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో పతకం ఖాయమైంది. ఫైనల్లో భారత జట్టు పాకిస్థాన్ లేదా శ్రీలంకతో తలపడనుంది.

తొలి సెమీస్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ మహిళల జట్టు భారత్‌ బౌలింగ్‌ తుఫాన్‌ ముందు బలైంది. తొలి ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ కేవలం 51 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్‌కు పూజా వస్త్రాకర్ షాక్ ఇచ్చింది. పూజా తన తొలి ఓవర్ తొలి బంతికే షాతీ రాణిని అవుట్ చేయగా, 5వ బంతికి షమీమా సుల్తానా ఎల్బీగా ట్రాప్‌కు గురై సున్నాకి పెవిలియన్ చేరింది. అనంతరం శోభన మోస్తరి 8 పరుగులు చేసి నిష్క్రమించింది.

ఇవి కూడా చదవండి

రీతు మోని 8 పరుగులు, మరుఫా అక్టర్ 0, షోర్నా అక్టర్ 0, ఫాహిమా ఖాతున్ 0, సుల్తానా ఖాతున్ 3, రబెయా ఖాన్ 3, నహిదా అక్టర్ 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 51 పరుగులకే ఆలౌటైంది. భారత్ తరపున పూజా 4 ఓవర్లు వేసి 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా, టిటాస్ సాధు, దేవిక వైద్య, అమంజోత్ కౌర్, రాజేశ్వరి గైక్వాడ్ తలో వికెట్ తీశారు.

52 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించిన భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన (7), షఫాలీ వర్మ (17) వికెట్లు కోల్పోయినా ఇబ్బంది లేదు. జెమీమా రోడ్రిగ్స్ (20), కనికా అహుజా (1)లు 8.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.

భారత మహిళల క్రికెట్ జట్టు 8 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయంతో 2023 ఆసియా క్రీడల ఫైనల్స్‌కు చేరుకుంది. సోమవారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్-శ్రీలంక జట్లు తలపడనుండగా, గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్లో స్వర్ణం కోసం పోరాడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..