AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Vishnu: విష్ణువును హరి అని ఎందుకు పిలుస్తారు ? గురువారం పూజించడానికిగల కారణాలు..

పురణాల్లో ప్రతి వారంలో ప్రతిరోజూ ఏదోఒక దేవతలకు అంకితం చేసి ఉంది. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం అయ్యప్పకు

Lord Vishnu: విష్ణువును హరి అని ఎందుకు పిలుస్తారు ? గురువారం పూజించడానికిగల కారణాలు..
Rajitha Chanti
|

Updated on: Feb 19, 2021 | 7:41 PM

Share

పురణాల్లో ప్రతి వారంలో ప్రతిరోజూ ఏదోఒక దేవతలకు అంకితం చేసి ఉంది. సోమవారం శివుడికి, మంగళవారం హనుమంతుడికి, బుధవారం అయ్యప్పకు ఇలా వారంలో ప్రతి రోజూ దేవుళ్ళకు కేటాయించబడింది. అలాగే గురువారం షిర్డీ సాయిని పూజిస్తుంటాం. సాయి బాబాతోపాటు విష్ణువును కూడా పూజిస్తుంటారు. హిందూ పురాణాల ప్రకారం విష్ణువును గురువారం ఆరాధించడం వల్ల జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే విష్ణువును హరి పేరుతో పిలుస్తారు. విష్ణువును హరి అని ఎందుకు పిలుస్తారు మరియు గురువారం పూజ ఎందుకు చేస్తారు అనే విషయాలను తెలుసుకుందాం.

హరి అని ఎందుకు అంటారు ?

‘హరి హరతి పాపని’ అంటే ‘హరి’ మన జీవితంలోని అన్ని పాపాలను తీసేస్తాడు. ‘హరి’ అంటే బుజించేవాడు అని అర్థం. హరి అంటే కష్టాలను తొలగించేవాడు. విష్ణువును హృదయపూర్వకంగా కోలిచే భక్తుడికి పాపాలన్నింటినీ తొలగిస్తాడని పురణాలలో చెప్పబడింది. అలాగే ఎంత పెద్ద సమస్యలు ఉన్నా వారికి విముక్తి కలుగుతుంది. అందుకే ఆయనను హరి, శ్రీహరి అని భక్తితో పిలుస్తారు.

విష్ణువును గురువారం ఎందుకు పూజిస్తారు…

పురణాల ప్రకారం పక్షులలో అతి పెద్ద పక్షి గరుడుడు విష్ణువు యొక్క వాహనంగా ప్రతీతి. గరుడుడు విష్ణువును కఠినమైన తపస్సుతో ఆయన దృష్టిని పొందినట్లుగా చెప్పుకుంటారు. గరుడ పక్షి తపస్సుతో సంతోషించిన విష్ణువు అతన్ని తన వాహనంగా ఉండేందుకు అంగీకరించాడు. గురు అంటే భారీ మరియు గరుడ కూడా పక్షులలో బరువైనది. గరుడ అంటే కాఠిన విజయాన్ని సాధించునది అని అర్థం. ఈ కారణంగానే గురువారం విష్ణువు ఆరాధన చేస్తారు. కొంతమంది పండితులు కూడా గురు బృహస్పతి విష్ణువు యొక్క రూపం అని నమ్ముతారు. కాబట్టి గురువారం విష్ణువు రోజూగా భావిస్తారు.

విష్ణువు పాముపై ఎందుకు పడుకున్నాడు..

క్షీర సముద్రంలో శేషనాగు మీద నిద్రిస్తున్నట్లుగా విష్ణువు ఫోటోలు మనం చూస్తుంటాం. అయితే క్షీర సాగరం అంటే ఆనందం లేదా శ్రేయస్సు మరియు శేషనాగు దుఃఖాన్ని సూచిస్తుంది. విష్ణువు క్షీరసాగరంలో శేషనాగుపై ప్రశాంతంగా పవనిస్తున్నట్లుగా ఉంటాడు. ఆ చిత్రం చూస్తుంటే ఆనందం, మరియు అసంతృప్తి రెండింటిలోనూ ఒకే పద్ధతిలో జీవించాలి అని సూచిస్తుంది. ఈ రూపం అంటే మానవులు ఆనందం మరియు అసంతృప్తి రెండింటిలోనూ ఒకే పద్ధతిలో జీవించాలి అని సూచిస్తుంది.

Also Read:

Anointing Lord Shiva: పరమశివుడికి అభిషేకం ఎందుకు చేయాలి ? శివాభిషేకం గురించి పురాణాలెమంటున్నాయి..