AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశివారికి భూ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.. జాగ్రత్తగా ఉండడం మంచిది.

Horoscope Today: మనం ప్రతి రోజూ ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదా ఇతర వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మరి ఎలాంటి అంశాలు వివాదానికి దారి తీస్తాయి.. ఏవి మనకు అనుకూలిస్తాయి. లాంటి వివరాలు తెలుసుకొని పనులు ప్రారంభించడం...

Horoscope Today: ఈ రాశివారికి భూ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి.. జాగ్రత్తగా ఉండడం మంచిది.
Narender Vaitla
|

Updated on: Feb 20, 2021 | 7:02 AM

Share

Horoscope Today: మనం ప్రతి రోజూ ఏదో ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదా ఇతర వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. మరి ఎలాంటి అంశాలు వివాదానికి దారి తీస్తాయి.. ఏవి మనకు అనుకూలిస్తాయి. లాంటి వివరాలు తెలుసుకొని పనులు ప్రారంభించడం చాలా ముఖ్యం. రాశి ఫలం ఆధారంగా చేసే పనుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది. మరి ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని. పనులు ప్రారంభించాలా.? వాయిదా వేసుకోవాలా.? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలిలాంటి నిర్ణయాలు తీసుకోండి.. ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేష రాశి:

మేష రాశి వారు ఈరోజు వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేసే పరిస్థితి కనిపిస్తోంది. తగు జాగ్రత్తలను పాటిస్తూ అప్పు సంబంధిత విషయాలను అధిగమించాల్సి ఉంటుంది. శ్రీవెంకటేశ్వర స్వామి వారికి పొంగలి నివేధించడం ఈ రాశి వారికి సూచించతగిన అంశం.

వృషభ రాశి:

ఈ రాశి వారు ఈరోజు విద్యా సంబంధిత అంశాల్లో మంచి ఫలితాలను సాధించుకుంటారు. వస్తు, వస్త్ర లాభాలు కలిగే అవకాశాలున్నాయి. వృషభ రాశి వారికి గురు గ్రహ అర్చన మేలు చేస్తుంది.

మిథున రాశి:

మిథున రాశి వారికి ఈరోజు పరిస్థితులు అనుకూలించేలా కనిపిస్తున్నాయి. సభలు, సమావేశాల్లో పాల్గొనే అవకాశాలున్నాయి. శ్రీవెంకటేశ్వర స్వామి వారికి పెరుగన్నం నైవేధ్యంగా సమర్పిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి:

ఈ రాశివారు ఈరోజు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఆస్తి సంబధిత వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. నవ ధాన్యాలు కలిపిన మంచి నీటితో పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.

సింహ రాశి:

సింహ రాశి వారు ఈరోజు గతంలో ఎవరిదగ్గరైతే అప్పులు తెచ్చుకున్నారో వారి నుంచి ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలున్నాయి. ఈ రాశి వారికి నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కన్య రాశి:

ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు సాఫీగా సాగిపోతుంటాయి. వ్యవహారిక విషయాల్లో కాస్త దూకుడుగా ప్రవర్తిస్తుంటారు. మంధార పుష్పాలతో మహా గణపతికి అర్చన నిర్వహిస్తే ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

తుల రాశి:

తుల రాశి వారు చేపట్టిన పనులు నెమ్మదిగా ముందుకుసాగేలా కనిపిస్తున్నాయి. సాంఘిక, జన సంక్షేమ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్ర పారాయణం మంచి చేస్తుంది.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో కొంత నిదానంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. భూ సంబంధిత వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు విష్ణు ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి ఈరోజు కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. పేద వారికి కాయగూరలు దానం చేస్తే ఈ రాశి వారికి మంచి చేకూరుతుంది.

మకర రాశి:

ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో శుభకార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఉన్న ఇబ్బందులు తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేద వారికి ఆహార పదార్థాలు దానం చేయడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.

కుంభ రాశి:

కుంభ రాశి వారు ఈ రోజు సన్నిహితులను కలుసుకుంటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరికి విష్ణు ఆరాధన మంచి చేస్తుంది.

మీన రాశి:

ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు కాస్త ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మహాలక్ష్మి అమ్మవారికి చక్కరి పొంగలి నివేదన చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి.

Also Read: Radhasaptami 2021: తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ సూర్యదేవాలయం ఎక్కడ ఉందో తెలుసా.. దాని విశిష్టత ఏమిటంటే

Follow Us
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద
వద్దన్నా డబ్బే డబ్బు..ఈశాన్యంలో ఈ 3వస్తువుల పెడితే కోట్ల సంపద