AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhasaptami 2021: తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ సూర్యదేవాలయం ఎక్కడ ఉందో తెలుసా.. దాని విశిష్టత ఏమిటంటే

ఈరోజు రథసప్తమి సూర్యభగవానుడిని భక్తిశ్రద్దలతో పూజిస్తాము.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యదేవాలయం అని ఎక్కువుగా గుర్తు తెచ్చుకుంటారు.. అయితే తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఓ ప్రముఖ సూర్యదేవాలయం...

Radhasaptami 2021: తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ సూర్యదేవాలయం ఎక్కడ ఉందో తెలుసా.. దాని విశిష్టత ఏమిటంటే
Surya Kala
|

Updated on: Feb 19, 2021 | 12:13 PM

Share

Radhasaptami 2021: ఈరోజు మాఘమాస సప్తమి.. లోక బాంధవుడు.. ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ పుట్టిన రోజును ఈరోజు రధ సప్తమిగా జరుపుకుంటాం.. మనదేశంలో ప్రముఖ సూర్యాదేవలయాలు అంటే ఒరిసాలోని కోణార్క్ టెంపుల్, గుజరాత్ లోని మొడెరా దేవాలయం.. ఇక ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్యదేవాలయం అని ఎక్కువుగా గుర్తు తెచ్చుకుంటారు.. అయితే ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఓ ప్రముఖ సూర్యదేవాలయం ఉందని చాలా తక్కువమందికి తెలుసు..రథసప్తమి సందర్భంగా ఈ ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం..!

తూర్పుగోదావరి జిల్లా గొప్ప వైవిధ్యము కలిగిన దేవాలయాలకు మరియు విగ్రహాలకు ప్రసిద్ది చెందింది. గొప్ప సంప్రదాయములకు, వారసత్వ సంపదకు, చారిత్రాత్మక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం. గొల్లలమామిడాడ కాకినాడకు సమీపంలోని కొబ్బరి తోటల మధ్యలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉంది. ఈ ఆలయం 16 ఎకరాల స్థలంలో 170 అడుగుల ఎత్తైన గోపురంతో భక్తులను ఆకర్షిస్తుంటుంది. గోపురం మీద కనువిందు చేస్తూ 100 కు పైగా చెక్కిన శిల్పాలున్నాయి. వివిధ పురాణాల ఆధారంగా చెక్కిన దేవ దేవతల శిల్పాలు చూడటానికి రెండు కనులు చాలవు అనే ఫీలింగ్ ఇస్తుంది. అంతేకాదు ఈ ప్రాంతాలకు ”చిన్న భద్రాచలం“ అని మరో పేరు ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో గొల్లాల మామిదాడ సూర్యదేవాలయం.. అరసవల్లి సూర్యనారాణయ స్వామి దేవాలయం తరువాత అంతటి ప్రఖ్యాతి గాంచిన రెండో దేవాలయంగా పేరు తెచ్చుకుంది. ఇక్కడి సూర్యదేవుని ఒక్క సారి దర్శించుకుంటే చాలు భక్తుల కోరికలు కొంగుబంగారమవుతాయని భక్తులు నమ్మకం. ఏడు గుర్రాల రథంలో సమస్తాన్ని పాలించే దేవున్ని ఒక్క సారి కన్నులారా వీక్షించినంతనే సకల పాపాలూ తొలగిపోతాయి. ఈ ఆలయాన్ని 1920 వ సంవత్సరంలో నిర్మించారు. దీంతో ప్రతీ ఆదివారం ఆ ఆలయంలో భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారి కోరికలను కోరుకుంటుంటారు. శ్రీ సూర్యదేవాలయం ప్రాంగణంలో వెంకటేశ్వర ఆలయం, సాయి ఆలయం, ప్రసిద్ధ భీమేశ్వర ఆలయం అనేక ఆలయాలు ఉన్నాయి.

ఇక చారిత్రక పట్టణం పెద్దాపురంలో సూర్యనారాయణమూర్తి ఆలయం: దేశం లోని ప్రముఖ దేవాలయలలో ఒక్కటైన సూర్య దేవాలయాలయం మన పెద్దాపురం పాండవుల మెట్ట పైన ఉంది. ఈ ఆలయం పక్కనే పంచముఖి గాయత్రి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వినాయకుడు, వెంకటేశ్వరస్వామి, చంద్ర, నవగ్రహాల ఆలయాలు ఉన్నాయి..

Also Read:

Chattrapati Shivaji Jayanti: ఛత్రపతి శివాజీ అధిరోహించిన గుర్రం పేరు.. విశిష్టత గురించి తెలుసుకుందాం..!

: ఆల్‌ రౌండర్లతో అదరగొట్టేందుకు ప్లాన్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌.. జట్టులోకి కొత్తగా..