AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan Antarvedi visit: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్, లైవ్ అప్డేట్స్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తూర్పుగోదావరిజిల్లా ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది చేరుకున్నారు. ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హెలిప్యాడ్‌కు..

YS Jagan Antarvedi visit: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కొత్త రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్, లైవ్ అప్డేట్స్
Venkata Narayana
|

Updated on: Feb 19, 2021 | 1:20 PM

Share

YS Jagan Antarvedi visit Live updates : తూర్పుగోదావరి జిల్లాలోని ప్రతిష్టాత్మక అంతర్వేది మహా క్షేత్రం శోభాయమానంగా వెలిగిపోతోంది. రథసప్తమి పర్వదినం ఒకవైపు,  లక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం ప్రారంభోత్సవం మరోవైపుగా క్షేత్రం కనులవిందు చేస్తోంది.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి నూతన రథానికి పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి రథాన్ని లాగి ప్రారంభోత్సవం చేశారు. కాగా,  సీఎం జగన్  ఈ ఉదయం 11.20 గంటలకు అంతర్వేది ఫిషింగ్‌ హార్బర్‌ దగ్గర హెలిప్యాడ్‌కు చేరారు.  11.35 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్నారు. లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనం, అర్చన, మంత్రపుష్పం సమర్పణ తదితర కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. 12 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి రథాన్ని ప్రారంభించారు. అంతర్వేది పర్యటన అనంతరం 1.30కి తాడేపల్లికి  తిరిగి చేరుకున్నారు జగన్.

ఇలా ఉండగా, గతేడాది సెప్టెంబర్‌ 5న అంతర్వేదిలో రథం దగ్ధమై, దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం స్పందించారు. కొత్త రథంతోనే ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రథం దగ్ధం కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రతిపక్షాల ఆరోపణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం ఈ కార్యక్రమం వెంటనే కార్యరూపం దాల్చేలా సెప్టెంబర్‌ 8న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. 95 లక్షల నిధులు మంజూరు చేశారు. స్వామి కల్యాణోత్సవాల సమయానికి కొత్త రథాన్ని సిద్ధం చేయాలనే సంకల్పంతో పనులు వేగవంతగా పూర్తి చేశారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 19 Feb 2021 12:58 PM (IST)

    ఆలయ ఆవరణలోనే ప్రసాదాలు వండి స్వామివారికి సమర్పణ

    రథసప్తమి పురస్కరించుకుని భక్తులు ఆయా ఆలయ ఆవరణలోనే ప్రసాదాలు వండి స్వామివార్లకి సమర్పించుకుంటున్నారు. భారతదేశంలోనే వైష్ణవ సాంప్రదాయాల దేవాలయంగా తూర్పుగోదావరిజిల్లాలో ఉన్న గొల్లలమామిడాడ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈనెల 23వ తేదీన స్వామివారి కల్యాణం జరుగుతుందని. అనంతరం రథోత్సవం, గరుడ వాహనంలో స్వామివారి ఊరేగింపు, పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చడం జరుగుతుందని సదరు ఆలయ కమిటీ తెలిపింది.

  • 19 Feb 2021 12:54 PM (IST)

    ఘనంగా రథసప్తమి వేడుకలు

    రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో వైష్ణవ సాంప్రదాయాలతో  సూర్యనారాయణ మూర్తికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తున్నారు.  దీంతో దేవాలయమంతటా ఉత్సవ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచీ భక్తులు క్యూ లైన్లలో నిల్చుని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు.

  • 19 Feb 2021 12:33 PM (IST)

    కోటి రూపాయల వ్యయంతో నూతన రథం నిర్మాణం

    ప్రఖ్యాత అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథాన్ని 40 అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులతో రూపుదించారు. నూతన రథాన్ని కొత్త హంగులు, రక్షణ ఏర్పాట్లతో నిర్మాణం చేపట్టారు. 1,330 ఘనపుటడుగుల బస్తర్ టేకుతో నూతన రథం నిర్మాణం జరిగింది. రికార్డ్ స్థాయిలో 3 నెలల కాలంలోనే నూతన రథాన్ని నిర్మించారు.

  • 19 Feb 2021 12:28 PM (IST)

    అంతర్వేది పుణ్యక్షేత్ర రథాన్ని లాగుతోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. అంతకు ముందు అంతర్వేది ఆలయ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌కు.. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం అర్చన, మంత్రపుష్పం సమర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాజ్యలక్ష్మి అమ్మవారిని సీఎం వైయస్‌ జగన్‌ దర్శించుకున్నారు. స్వామి, అమ్మవార్ల ద‌ర్శనం అనంత‌రం తీర్థప్రసాదాలు స్వీక‌రించారు. నూతన రథం వద్ద ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి.. భక్తులతో కలిసి నూతన రథాన్ని తాడుతో లాగారు.

Published On - Feb 19,2021 1:04 PM

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా