Chattrapati Shivaji Jayanti: ఛత్రపతి శివాజీ అధిరోహించిన గుర్రం పేరు.. విశిష్టత గురించి తెలుసుకుందాం..!
ఛత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే భారాతావని పులకించిపోతుంది. హిందూ మతం ఆనంద డోలికల్లో తెలియాడుతుంది. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని...
Chatrapathi Sivaji’s Horse : ఛత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే భారాతావని పులకించిపోతుంది. హిందూ మతం ఆనంద డోలికల్లో తెలియాడుతుంది. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. ఇక శివాజీ హిందు రాజ్య స్థాపన కోసం భవాని మాత ఇచ్చిన ఖడ్గం చేతబూని.. తనకు ఇష్టంమైన చేతక్ (గుర్రం)ను అధిరోహించి 390 కి పైగా యుద్దాలు చేసి.. ఏ యుద్ధం లో కూడా గెలుపు తప్ప ఓటమి తెలియని హైందవ వీరుడు. నేడు శివాజీ జయంతి సందర్భంగా ఆయన అధిరోహించిన గుర్రం విశిష్టతను గురించి తెలుసుకుందాం..!
అశ్వములో కెల్లా పంచకల్యాణి అత్యంత శ్రేష్టమైనది. ఈ హాయానికి ఉండాల్సిన లక్షణాలు గురించి తెలుసుకుందాం..! (1) నాలుగు కాళ్ళు తెలుపు రంగులో ఉండాలి. (2) ముఖం పై తెల్లటి బొట్టు ఉండాలి. (3) తెల్లటి కుచ్చుతోక కలిగి ఉండాలి. (4) వీపు మొత్తం తెలుపు రంగులో ఉండాలి.. (5) మెడపై ఉండే జూలు కూడా పూర్తిగా శ్వేత వర్ణంలోనే ఉండాలి.
ఇక రాజుల కాలంలో ఈ అశ్వాలకు అత్యంత ప్రాధాన్యత ఉండేది. అందుకనే రాజులు తమ పదాతి దళాల్లో అశ్వదళాన్ని బలోపేతం చేసుకునేవారు. ఇక చేసిన యుద్ధాల్లో ఓటమి ఎరుగని ధీరుడు భరతమాత ముద్దు బిడ్డ ఛత్రపతి శివాజీ గుర్రాన్ని విశ్వాస్ అని పిలిచేవారని ఇది పంచ కళ్యాణి జాతికి చెందిన గుర్రమని చాలా మందికి తెలుసు. అయితే శివాజీ అశ్వదళం గురించి.. ఆయన ఉపయోగించిన గుర్రాల గురించి ఈరోజు తెలుసుకుందాం
మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఎక్కువగా ఉపయోగించింది అశ్వదళం. శివాజీ మహారాజ్ సైన్యం ఎక్కువగా భీమ్తాడి జాతి గుర్రాలను ఉపయోగించింది . ఈ జాతి సయద్రిస్ పర్వత శ్రేణుల మీదుగా ఎక్కడానికి అనువైనవి.. అంతేకాదు ఈ గుర్రాలు ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలవు.. దీంతో ఎక్కడికైనా ప్రయాణించడానికి వీలుగా వీటికి మరాఠాలు శిక్షణ ఇచ్చారు. ఇక ఈ గుర్రాలను డెక్కన్ జాతి లేదా డెక్కానీ అని కూడా పిలుస్తారు. వాటికి ఇండియన్ డెక్కన్ పీఠభూమి నుండి పేరు వచ్చిందని తెలుస్తోంది. శివాజీ సైన్యం స్వదేశీ జాతి గుర్రాలతో పాటు.. కొన్ని అరేబియా గుర్రాలను కూడా ఉపయోగించారు .
ఇక శివాజీ మహారాజుగా తన 50 సంవత్సరాలలో ప్రయాణంలో 7 గుర్రాలను ఉపయోగించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ .. మోతీ , విశ్వస్ , గజ్రా, రణబీర్ , కృష్ణ , తురంగి , ఇంద్రాయణి గుర్రాలను ఉపయోగించేవారని తెలుస్తోంది,
ఐతే శివాజీ మహారాజ్ ఉపయోగించిన గుర్రాలు కొన్ని మగ గుర్రాలు.. కొన్ని ఆడ గుర్రాలు ఉన్నాయి. ఇక ఛత్రపతి శివాజీ ఉపయోగించిన చివరి గుర్రం కృష్ణుడు . దీనికి చరిత్రలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ గుర్రం ఆ కాలంలో లభించే అత్యంత గొప్ప జాతి అశ్విని జాతి హయం. ఈ గుర్రానికి ప్రాముఖ్యత పట్టాభిషేకం సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తెల్ల గుర్రం మరియు ఏనుగును ఉపయోగించారు, ఈ తెల్ల గుర్రం కృష్ణుడు. అయితే ఎక్కువుగా శివాజీ మహారాజ్ ఉపయోగించే ఏకైక గుర్రం కృష్ణుడి గురించి చాలా మందికి తెలుసు .