RCB IPL Auction 2021: వ్యూహాత్మకంగా జట్టును ఎంపిక చేసుకున్న ఆర్‌సీబీ.. కేవలం ఇద్దరి కోసమే ఏకంగా రూ. 29.25 కోట్లు..
RCB IPL Auction 2021: చెన్నై వేదికగా గురువారం ఐపీఎల్ 2021 మినీ వేలంపాట ముగిసిన విషయం తెలిసిందే. 292 మంది ఆటగాళ్లలో 57 మందిని ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి...
RCB IPL Auction 2021: చెన్నై వేదికగా గురువారం ఐపీఎల్ 2021 మినీ వేలంపాట ముగిసిన విషయం తెలిసిందే. 292 మంది ఆటగాళ్లలో 57 మందిని ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ వేలం పాటలో రాయంల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్స్ ఎంపికలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లింది. ఇందుకోసం బెంగళూరు ఫ్రాంచైజీ రూ.35.40 కోట్లతో 8 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. గ్లెన్ మాక్స్‌వెల్ (రూ.14.25 కోట్లు)తో బ్యాటింగ్, కైల్ జెమీషన్(రూ.15 కోట్లు)తో బౌలింగ్‌లో పట్టునిలుపుకునే ప్రయత్నం చేసింది. ఆర్‌సీబీ కేవలం వీరిద్దరి కోసమే రూ. 29.95 కోట్లు కేటాయిండచం విశేషం. వీరిద్దరితోపాటు బెంగళూరు కొనుగోలు చేసిన మిగితా ప్లేయర్స్ వివరాలు.. సచిన్ బేబీ (రూ.20 లక్షలు), రాజత్ పటిదార్ (రూ.20 లక్షలు), మహ్మద్ అజహరుద్దీన్ (రూ.20 లక్షలు), డేనియల్ క్రిస్టియన్ (రూ.4.8 కోట్లు), ప్రభుదేశాయ్ ( రూ.20 లక్షలు), కేఎస్ భరత్ (రూ.20 లక్షలు)లను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ 2021 సీజన్ ఆర్‌సీబీ జట్టు ప్లేయర్స్.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, చాహల్, దేవదత్ పడిక్కల్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, జోష్ ఫిలిప్పీ, షబాజ్ అహ్మద్, పవన్ దేశ్‌పాండే, కైల్ జెమీషన్ , గ్లెన్ మాక్స్‌వెల్ , సచిన్ బేబీ, రాజత్ పటిదార్ , మహ్మద్ అజహరుద్దీన్ , డేనియల్ క్రిస్టియన్, ప్రభుదేశాయ్ , కేఎస్ భరత్.
A well-balanced squad with all the bases covered ?
Who do you think will be the gamechanger among our #Classof2021, 12th Man Army??#PlayBold #WeAreChallengers #IPLAuction pic.twitter.com/ZrGqV9cN7r
— Royal Challengers Bangalore (@RCBTweets) February 19, 2021
Also Read: SRH IPL Auction 2021: చెన్నై వదులుకుంది.. హైదరాబాద్ దక్కించుకుంది.. షాక్‌లో అభిమానులు..