Salary Hikes: ఉద్యోగులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్.. జీతాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీలు..
Salary Hike This Year: కరోనా కారణంగా గతేడాది భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను నిర్మోహమాటంగా బయటకు పంపించేశాయి...
Salary Hike This Year: కరోనా కారణంగా గతేడాది భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. చాలా కంపెనీలు తమ ఉద్యోగులను నిర్మోహమాటంగా బయటకు పంపించేశాయి. లాక్‌డౌన్ తదనంతర కార్యక్రమాల తర్వాత ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నష్టపోవడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా కుప్ప కూలిపోవడంతో దాదాపు అన్ని రంగాలపై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, కరోనా తీవ్రత కూడా తగ్గుతుండడంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ సర్వేలో తేలింది. భారతదేశానికి చెందిన పలు కంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది సగటు వేతన పెంపు 7.3 శాతం ఉండొచ్చని డెలాయిట్ తన నివేదికలో తెలిపింది. ఏడు రంగాలు, 25 ఉప రంగాలకు చెందిన 400 సంస్థలు ఈ సర్వేలో పలు అంశాలను పంచుకున్నాయి. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం.. సుమారు 92 శాతం కంపెనీలు ఈ ఏడాది తమ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్లు తెలిపాయి. అయితే గతేడాది ఇది కేవలం 60 శాతం మాత్రమే ఉండడం గమనార్హం. ఇక సుమారు 20 శాతం కంపెనీలు రెండంకెల స్థాయిలో జీతాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. గతేడాది మొత్తానికే ఇంక్రిమెంట్ ఇవ్వని కంపెనీలు ఈ ఏడాది అధికంగా వేతనాలు పెంచడం లేదా బోనస్ అందించాలని యోచిస్తున్నాయి. లైఫ్ సైన్సెస్, ఐటీ రంగ కంపెనీలు అధిక ఇంక్రిమెంట్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది.
Also Read: దీనిని చూస్తుంటే.. ఛాంపియన్ టైటిల్ కోల్పోయే ప్రమాదముంది: ఆనంద్ మహీంద్రా ట్వీట్