దీనిని చూస్తుంటే.. ఛాంపియన్ టైటిల్ కోల్పోయే ప్రమాదముంది: ఆనంద్ మహీంద్రా ట్వీట్
Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. కొత్త విషయాలపై ఆయన వెంటనే స్పందిస్తుంటారు. ఆయన షేర్ చేసే విషయాలు, చిత్రాలు..
Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. కొత్త విషయాలపై ఆయన వెంటనే స్పందిస్తుంటారు. ఆయన షేర్ చేసే విషయాలు, చిత్రాలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన చిత్రం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ వ్యక్తి బైక్ ఎక్సకవేటర్‌పై కూర్చొని ఉంటాడు. అయితే ఈ చిత్రాన్ని పంచుకుంటూ.. ఆనంద్ మహింద్రా దీనికి క్యాప్షన్ కూడా రాశారు. తెలివితేటలతో అద్భుతమైన వాటిని నిర్మించడంలో భారతీయులు ఒక్కరే ఛాంపియన్లు కాదనేలా ఆశ్యర్యంతో కామెంట్ రాశారు.
అమెరికాలోని ఒక స్నేహితుడు తనకు ఫార్వార్డ్ చేసాడని మహీంద్రా తెలిపారు. దీనిని చూస్తుంటే.. ఛాంపియన్స్ టైటిల్ కోల్పోయే ప్రమాదం ఉంది.. ఈ వ్యక్తి తన మహీంద్రా లోడర్ బైక్ తనను కట్టిపడేశాడంటూ ఆయన ట్విట్ చేశారు. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ పోస్టుకు వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
Also Read: