Anointing Lord Shiva: పరమశివుడికి అభిషేకం ఎందుకు చేయాలి ? శివాభిషేకం గురించి పురాణాలెమంటున్నాయి..
పరమశివుడు అభిషేక ప్రియుడు. ఓ పండు సమర్పించినా, ఓ చెంబుడు నీళ్ళతో అభిషేకించినా దండిగా అనుగ్రహించే బోళాశంకరుడు. మహాశివరాత్రి రోజు చేసే అభిషేకం మహాదేవునికి మరింత ప్రీతికరమని చెబుతారు.
పరమశివుడు అభిషేక ప్రియుడు. ఓ పండు సమర్పించినా, ఓ చెంబుడు నీళ్ళతో అభిషేకించినా దండిగా అనుగ్రహించే బోళాశంకరుడు. మహాశివరాత్రి రోజు చేసే అభిషేకం మహాదేవునికి మరింత ప్రీతికరమని చెబుతారు. ఎలాగైతేత మనం మన శరీరంపై ఉన్న దుమ్ము, ధూళీ, మురికి తొలగించుకోవడానికి స్నానం చేస్తామో.. అలాగే మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళన కావడానికి శివుడికి అభిషేకం చేయాలి. రజస్సు అంటే రజోగుణం అనీ ధూళీ అనీ అర్థాలున్నాయి. మనలోని రజోగుణాన్ని సంస్కరించడానికి, మానవత్వం ఉన్నవారిగా మారడానికి పరమశివుణ్ణి అభిషేకించాలి. శివుడికి కొన్ని పదార్థాలతో అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అందులో ముఖ్యమైనవి.. పసుపుతో శివునికి అభిషేకం చేయిస్తే ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూలత లభిస్తుంది. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. చందన తైలంతో అభిషేకం చేస్తే ఉదర సంబంధిత వ్యాధులు తొలగిపోతాయని పురణాల్లో ప్రతితీ. అలాగే శివుడిని పంచామృతంతో అభిషేకించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నేతిలో శివాభిషేకం చేస్తే మోక్షం సిద్ధిస్తుందని.. పాలాభిషేకం చేస్తే ఆయుర్దాయం పెరుగుతుందని నమ్ముతుంటారు. వీటితో పాటు పెరుగుతో కూడా అభిషేకం చేయడం ద్వారా ద్వారా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇవే కాకుండా బత్తాయిపండ్ల రసంతో శివాభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని, అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతామని పురోహితుల మాట.
అభిషేకం ఎందుకు చేయాలి..
ఫలోదకాలను మన తెలివితో సంపాదించుకున్నామనే అహంకారాన్ని వదిలి.. అవన్నీ భగవంతుడు ప్రసాదిస్తే.. అనుభవించగలుతున్నామని గుర్తించేందుకు శివాభిషేకం చేయాలి. అందుకు మనసులో నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడం అభిషేకంలో ఉన్న అంతరార్థం. వినయాన్ని విన్నవించుకోవడం అభిషేకం. సృష్టిలో తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిననీ, తనంతటివారు మరేవరూ లేరని అనుకోవడం మనిషి సహజ అహాంకారం. కానీ అభిషేక సమయంలో వినిపించే రుద్రాధ్యాయంలోని మంత్రభాగం మనకు కనువిప్పు కలిగిస్తుంది. సృష్టిలోని సకలప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూరపమేననీ, సకల ప్రాణులకూ శుభం కలగాలని మనం అందులో కోరుకుంటున్నట్లుగా శివాభిషేకం చేయాలి. అభిషేకం చేసే సమయంలో వెలువడే మంత్రాల అర్థాలు మన అంతరంగాన్ని తట్టి మేల్కోల్పుతాయి. అప్పుడు జ్ఞాన జ్యోతి స్వరూపుడైన పరమశివుడు మనలో ఆవిర్భవిస్తాడు. అదే మహాశివరాత్రి నాడు మనం పొందవలసిన మహాలింగోద్భవ సందర్శనం.
Also Read: లండన్ నుంచి స్వదేశానికి చేరిన సీతారామలక్ష్మణ కాంస్య విగ్రహాలు