Today Horoscope: కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా..? అయితే ఈ రాశుల వారు తప్పనిసరిగా..
Today Horoscope: రాశి ఫలాలను అనుసరించి కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టే వారు మనలో చాలా మంది ఉంటారు. ఏ రాశి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తగా ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలా వద్దా..?
Today Horoscope: రాశి ఫలాలను అనుసరించి కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టే వారు మనలో చాలా మంది ఉంటారు. ఏ రాశి వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. కొత్తగా ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలా వద్దా..? ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి లాంటి వివరాలు ఈరోజు రాశిఫలాల్లో తెలుసుకుందాం..
మేష రాశి:
మేష రాశివారు ఈరోజు కొన్ని ఊహించని కార్యక్రమాల్లో పాల్గొంటారు. వీరు నది స్నానాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యనారాయణ స్వామికి అర్గమును వదలడం ఈ రాశి వారికి సూచించదగినది.
వృషభ రాశి:
ఈ రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ప్రతిఫలం కనిపిస్తుంది. కుటుంబసభ్యులతో కలిసి పలు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివాలయంలో స్వామి వారికి వస్త్రములు సమర్పిస్తే ఈ రాశివారికి మంచి జరుగుతుంది.
మిథున రాశి:
మిథున రాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఒత్తిళ్ల నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేయాలి. ‘చంద్రశేఖర అష్టక స్తోత్రాన్ని’ పరాయణం చేయడం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.
కర్కాటక రాశి:
ఈ రాశివారికి ఈరోజు ఆర్థిక పరిస్థితులు కాస్త అనుకూలించకపోతుండొచ్చు. ఉద్యోగ విషయంలో వీరు జాగ్రత్తతో ఉండాలి. ‘శ్రీరాజ మాతంగి నమః’ అనే నామజేపం చేస్తే మంచి జరుగుతుంది.
సింహ రాశి:
సింహ రాశి వారు ఈరోజు సన్నిహితులతో కలిసి విందు కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ‘గురుస్తోత్ర’ పారాయణం ఈ రాశివారికి మేలు చేస్తుంది.
కన్య రాశి:
ఈ రాశి వారికి ఈ రోజు ఇంటా బయట ఒత్తిళ్లు కనిపిస్తున్నాయి, జాగ్రత్తతో ఉండాలి. కన్య రాశి వారు నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే మంచి జరుగుతుంది.
తుల రాశి:
తుల రాశి వారు వ్యవహారిక విషయాల్లో ఏమాత్రం తొందరపడకూడదు, అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మి అమ్మవారికి క్షీరాన్నమును సమర్పించుకోవడం ఈ రాశి వారికి సూచించదగిన అంశం.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారు పట్టుదలతో వ్యవహరిస్తే కానీ.. చేపట్టిన పనులు పూర్తి చేయలేరు. పేద ప్రజలకు కాయకూరలు దానం చేస్తే మంచి జరుగుతుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు వ్యాపార వ్యవహారిక విషయాల్లో విస్తరణ కోసం ఎదురు చూస్తుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గో సేవ చేసుకుంటే ఈ రాశి వారికి మంచి జరుగుతుంది.
మకర రాశి:
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో కొంత ఒత్తుళ్లు ఏర్పడుతుంటాయి. చేపట్టిన కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. శివారాధన చేసుకోవడం ఈ రాశి వారికి సూచించదగిన అంశం.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పనుల్లో అనుకోని అవంతరాలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. మహాగణపతికి సింధూరం సమర్పించుకుని, ఆ సింధూరాన్ని నుదుట రక్షగా ధరిస్తే మేలు జరుగుతుంది.
మీన రాశి:
ఈ రాశి వారికి ఈరోజు శ్రమ పెరుగుతుంది. కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేరు. పెట్టుబడుల విషయంలో కచ్చితంగా జాగ్రత్తుల తీసుకోవాలి. మహాలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు సమర్పించాలి మరీ ముఖ్యంగా వీలైతే 11 తామర పుష్పాలను సమర్పించుకోవడం సూచించదగ్గ అంశం.
Also Read: ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా ? దాని విశిష్టత ఎంటంటే..