AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: లాల్‌బాగ్చా రాజాకి విరాళ వెల్లువ.. అమెరికన్ డాలర్లు, నోట్ల దండ, క్రికెట్ బ్యాట్

వినాయక చవితి మహోత్సవాలు దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. మహారాష్ట్రలో గణేష్ చతుర్ధి వేడుకలు గొప్ప వైభవంగా ప్రారంభమైంది. ముంబైలోని లాల్‌బాగ్చా రాజాను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. ఇప్పటికే హుండీ లెక్కలు మొదలు పెట్టారు. అందులో కోట్లాది రూపాయలు, డాలర్లు, క్రికెట్ బ్యాట్‌లు విలువైన కానుకలున్నాయి.

Mumbai: లాల్‌బాగ్చా రాజాకి విరాళ వెల్లువ.. అమెరికన్ డాలర్లు, నోట్ల దండ, క్రికెట్ బ్యాట్
Lalbaughcha RajaImage Credit source: Anushree Gaikwad
Surya Kala
|

Updated on: Aug 29, 2025 | 8:11 AM

Share

వినాయక చవితితో ప్రారంభమైన 10 రోజుల గణేశోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అయితే మహారాష్ట్రలో ఈ పండుగ వైభవాన్ని చూడడానికి రెండు కళ్ళు చాలవు అని అంటారు గణపయ్య భక్తులు. ముంబై, పూణేతో సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో భక్తులు బప్పాను డప్పుల చప్పుళ్ళ మధ్య కోలాహలంగా స్వాగతించారు. ఇళ్లలో, నివాస సముదాయాలలో, ప్రజా పండళ్లలో గణపతి బప్పాను స్థాపించారు. ముంబైలోని అత్యంత ప్రసిద్ధ గణపతి మండపం “లాల్‌బాగ్చా రాజా” ఈసారి కూడా భక్తులకు ఆకర్షణీయ కేంద్రంగా ఉంది. మొదటి రోజే దర్శనం చేసుకోవడానికి వేలాది మంది భక్తులు మండపానికి చేరుకున్నారు.

లాల్‌బాగ్ కా రాజా మొదటి హుండీ తెరిచినప్పుడు.. భక్తుల అచంచలమైన విశ్వాసం కనిపించింది. విరాళాలలో అమెరికన్ డాలర్ల హారము, కోట్ల రూపాయలు, క్రికెట్ బ్యాట్లు కూడా ఉన్నాయి. ఇది విశ్వాసం, నమ్మకానికి ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచింది. ఉదయం నుండే “గణపతి బప్పా మోరియా, మంగళ మూర్తి మోరియా అనే మంత్రాలతో వాతావరణం భక్తితో నిండిపోయింది. ప్రజలు డ్యాన్స్ చేస్తూ, పాడుతూ తమ ఇంటిలో ప్రతిష్టించిన ఇళ్లలోని గణపతి విగ్రహాలను మండపాలకు తీసుకువచ్చారు.

గణపతి దర్శనం కోసం బారులతీరిన ప్రముఖులు ఈరోజు సినిమా తారలు, ప్రముఖ వ్యక్తులు కూడా లాల్‌బాగ్ కా రాజా దర్శనం కోసం బారులు తీరతారు. నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ గణపతి బప్పా ఆశీర్వాదం కోసం వస్తారు. అదే సమయంలో క్రికెట్ దేవుడు అని పిలువబడే సచిన్ టెండూల్కర్ కుటుంబం కూడా దర్శనం కోసం వస్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భారీ సంఖ్యలో సెలబ్రెటీలు గణపతి బప్పా దర్శనం కోసం బారులు తీరతారు.

ఇవి కూడా చదవండి

ఈ ఉత్సవాన్ని సజావుగా, సురక్షితంగా నిర్వహించడానికి బృహన్ ముంబై సర్వజనిక్ గణేశోత్సవ సమన్వయ కమిటీ అన్ని మండపాలకు విజ్ఞప్తి చేసింది. గణేశోత్సవం అనేది సంస్కృతి, సంప్రదాయం, భక్తికి సంబంధించిన పండుగ మాత్రమే అని కమిటీ స్పష్టం చేసింది. ఈ దిశలో ముంబై పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. వీధుల్లో దాదాపు 17,600 మంది జవాన్లను మోహరించారు. దీనితో పాటు, మౌంటెడ్ పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌లు కూడా భద్రతా వ్యవస్థలో భాగం అయ్యాయి.

గణేష్ మండపాల్లో బారులు తీరిన భక్తులు ముంబైలోని లాల్‌బాగ్చా రాజాతో పాటు, చించ్‌పోక్లి చ చింతామణి వినాయక, జిఎస్‌బి సేవా మండపాల్లో భారీ రద్దీ నెలకొంటుంది. కింగ్స్ సర్కిల్ వద్ద ఉన్న GSB సేవా మండల్ ముఖ్యంగా బంగారం, వెండితో అలంకరించబడిన గొప్ప గణపతికి ప్రసిద్ధి చెందింది. దేశంలోని అత్యంత సంపన్న మండలాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..