Vidura Nithi: అదృష్టవంతురాలైన మహిళలకే అలాంటి భర్త దొరుకుతాడట.. విదురుడు ఏం చెప్పాడంటే..
హిందూ పురాణాలు గ్రంథాలు మనిషి ఎలా జీవించాలి? ఎలా జీవించకూడదు అనే విషయాన్నీ మాత్రమే కాదు. రామాయణం, మహాభారతం, భాగవతం వంటి పురాణాలలో పాటు వేమన, సుమతి, భర్తృహరి సుభాషితాలు వంటి ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతున్నాయి. ఆధునిక కాలంలో కూడా వీటిని అనుసరించిన మనిషి సుఖ సంతోషాలతో కలిసి జీవిస్తాడు. అలాంటి ఒక ధర్మ శాస్త్రమే విదుర నీతి. ఇందులో ఒక మనిషి మనిషిగా సమాజంలో జీవించాలంటే ధర్మార్ధ కామ మొక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధన కోసం చేయాల్సిన పనులు పూర్తిగా వివరించాడు విదురుడు.

పంచమ వేదం మహాభారతం ఉద్యోగపర్వంలో ధృతరాష్ట్రునికి విదురుడు చెప్పిన సామజిక రాజకీయ, కుటుంబ జీవనానికి చెందిన నీతి శాస్త్ర విషయాలు విదురనీతిగా ప్రసిద్ధి చెందాయి. ఇందులో విదురుడు భార్యాభర్తల బంధం గురించి కూడా చెప్పాడు. ఒక స్త్రీ తాను వివాహం చేసుకునే అబ్బాయి గురించి చాలా కలలు కంటుంది. తాను పెళ్లి చేసుకునే వ్యక్తికి కొన్ని లక్షణాలు ఉండాలని కోరుకుంటుందని చెప్పాడు. అంతేకాదు ఒక స్త్రీ ఎలాంటి లక్షణాలు కలిగిన పురుషుడిని వివాహం చేసుకుంటే.. ఆమె జీవితం సంతోషంగా సాగుతుందో కూడా వివరించాడు. అలాంటి స్త్రీ అంత అదృష్టవంతులు మరెవరూ ఉండరని.. తాను కోరుకున్న లక్షణాలు ఉన్న పురుషుడితో జీవించే స్త్రీ జీవితం ఆనందంతో నిండి ఉంటుందని విదురుడు చెప్పాడు.
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటి. విభిన్న లక్షణాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కలిసి జీవించాలని.. ఒకరినొకరు భావించినప్పుడు అది స్వర్గం లాంటి జీవితం. వైవాహిక జీవితంలో చిన్న చిన్న తగాదాలు, కోపం, ఆగ్రహంతో పాటు ప్రేమ కూడా ఉండటం ఆనందంగా ఉంటుంది. ఈ లక్షణాలలో కొన్నింటిని కలిగి ఉన్న భర్త ఆమెకు దొరికితే, ఆమె అంత అదృష్టవంతులు మరెవరూ ఉండరు.
విదురుడు చెప్పిన ప్రకారం యువతి కాబోయే భర్తలో కోరుకునే లక్షణాలు ఏమిటంటే
పరోపకారం: విదురుని నీతి ప్రకారం.. పరోపకారం చేసే వ్యక్తికి ఇలలో మాత్రమే కాదు స్వర్గంలో కూడా గౌరవ ప్రతిష్టలను అందుకుంటారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వారికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తిని ఎల్లప్పుడూ గౌరవిస్తారు. ఆ వ్యక్తి చేసే మంచి పనులే అతనికి చాలా కీర్తిని తెస్తాయి. ఇలా పరోపకారం చేసే భర్త దొరికిన భార్య చాలా అదృష్టవంతురాలు. తన భర్త గుణాలను బట్టి మాత్రమే సమాజం భార్యను గుర్తిస్తుందని విదురుడు చెప్పాడు.
నిజాయితీ: నిజాయితీగా ఉండటం అనేది ఏ వ్యక్తికైనా ఉండవలసిన ఉత్తమ లక్షణాలలో ఒకటి. ఈ గుణం ఉన్న వ్యక్తి తనకు మాత్రమే కాదు తన కుటుంబానికి కూడా గౌరవం తెస్తాడు. కుటుంబ సభ్యులందరూ ఈ వ్యక్తిని అనుసరిస్తారు. నిజాయితీపరుడి చేయి పట్టుకున్న స్త్రీ ఎల్లప్పుడూ సంతోషంగా జీవించగలదని విదురుడు చెప్పాడు.
దాన గుణం: తన కుటుంబ అవసరాలను తీర్చడంతో పాటు, దానగుణం కలిగి.. ధర్మంగా జీవితాన్ని గడిపే వ్యక్తి పుణ్యాన్ని పొందుతాడు. ఈ దానధర్మాలు ఆ వ్యక్తి ఫలాలు తరతరాలుగా నిలిచి ఉంటాయి. ఈ ఫలాల వలన ఆ కుటుంబంపై దేవుని ఆశీర్వాదాలు సదా ఉంటాయి. ఇంటిని ఆనందంతో నింపుతుంది. ఇలాంటి గుణం ఉన్న వ్యక్తిని భర్తగా పొందితే.. ఆ స్త్రీ జీవితం మారుతుంది. విదురుడు తన నీతిలో ఇలాంటి లక్షణాలున్న భర్తను పొందిన భార్య అదృష్టవంతురాలని.. ఇలలో స్వర్గం చూస్తుందని ..అంతులేని ఆనందాన్ని పొందుతుందని పేర్కొన్నాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు