ఇంట్లో దేవుడికి పువ్వులు సమర్పించడానికి నియమాలున్నాయి.. ఎలా అర్పించాలి? ఏ సమయంలో తీసివేయాలంటే
హిందూ మతంలో పూజకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. దేవుళ్ళకి పూజ చేసే సమయంలో పసుపు, కుంకుమ, గంధం అక్షతలు, పువ్వులు వంటి సామగ్రిని ఉపయోగిస్తారు. పువ్వులు దేవుళ్ళకు సమర్పించడం వలన సానుకూల శక్తి ఇంట్లో వ్యాపిస్తుంది అని నమ్ముతారు. అయితే పూజకు సంబంధించిన కొన్ని వాస్తు నియమాలున్నాయి. వీటిని సరిగ్గా పాటించకపోతే ఇంట్లో వాస్తు దోషాలు ఏర్పడతాయని నమ్మకం. ఇంట్లో పూజలో సమర్పించిన పువ్వులను తీసివేయడానికి కూడా నియమం ఉందని తెలుసా

హిందూ మతంలో పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ప్రజలు దేవునిపై తమ విశ్వాసాన్ని పూజ చేసి వ్యక్తపరుస్తారు. సరైన పద్ధతిలో చేసే పూజ మనసుకు శాంతిని ఇవ్వడమే కాదు ఇంటిని కూడా శుద్ధి చేస్తుంది. అంతేకాదు ఇంటి ప్రతి మూలలో సానుకూల శక్తి ప్రసారం అవుతుంది. పూజకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి,. వీటిని పాటించడం వల్ల ఇంటి వాస్తు కూడా మెరుగుపడుతుంది. అదే సమయంలో పూజ నియమాల గురించి ప్రజలలో చాలా గందరగోళం ఉంది. అతిపెద్ద గందరగోళం ఏమిటంటే.. దేవునికి సమర్పించిన పువ్వుల గురించి. పూజా మందిరంలో దేవునికి అర్పించే పువ్వులను అక్కడ నుంచి ఎప్పుడు తొలగించాలనే విషయం. ఈ రోజు పూజ చేసిన పువ్వులను ఎప్పుడు తీసివేయాలో తెలుసుకుందాం..
పూజ చేసిన పువ్వులు ఎప్పుడు తీసివేయాలంటే
కొంతమంది ఇంట్లో పూజ చేస్తూ దేవుడిని పువ్వులతో అలంకరిస్తారు. పువ్వులను సమర్పిస్తారు. అయితే వీటిని సరైన సమయంలో తీసివేయడం మర్చిపోతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేస్తూ దేవుడికి సమర్పించే పువ్వులను వెంటనే కాకపోయినా.. సాయంత్రం అంటే సూర్యాస్తమయానికి ముందు తీసివేయాలి.
వాస్తు ప్రకారం.. వాడిన పువ్వులను పూజా మదిరంలో ఉంచడం శుభం కాదు. ఈ పువ్వుల నుంచి ప్రతికూల శక్తి బయటకు రావడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. వాడిన పువ్వులు లేదా ఎండిన పువ్వుల ద్వారా విడుదలయ్యే శక్తి కారణంగా ఆ ఇంట్లో నివసించే వ్యక్తులు చాలా కోపంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో పూజ గదిలో దేవుళ్ళకు సమర్పించిన పువ్వులను సకాలంలో తీసివేయడం సరైన చర్య.
దేవుడికి ఎలా పూలు సమర్పించాలంటే
పూజ చేస్తూ దేవుడికి సమర్పించే పువ్వుల విషయంలో కూడా నియమాలున్నాయి. ఇంట్లోని మొక్కల నుంచి పువ్వులు కోసి దేవునికి పూలు అర్పించబోతున్నట్లయితే.. ముందుగా స్నానం చేయండి. దీని తర్వాత పూలను నీటితో కడగండి. కడిగిన పూలను కాండం పట్టుకుని పువ్వుని భక్తిశ్రద్దలతో దేవునికి సమర్పించడం సరైన మార్గం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








