Vastu Tips: ఈ వస్తువులను పొరపాటున కూడా అప్పుగా తీసుకోవద్దు.. డబ్బు కొరత ఏర్పడుతుంది..
హిందూ మతంలో అనేక నమ్మకాలు ఉన్నాయి. దేవుడు దెయ్యం, మంచి చెడు వంటి వాటిని నమ్ముతారు. అంతేకాదు వాస్తు శాస్త్రానికి మంచి ప్రాముఖ్యతనిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకుని ఉపయోగించకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వస్తువులను అప్పుగా తీసుకుని వాడుకుంటే ఇంట్లో సంపదకు కొరత ఏర్పడుతుంది. అవి ఏమిటో తెలుసుకుందాం..

హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తు శాస్త్రంలో, దిశల ప్రాముఖ్యతను వివరంగా వివరించడమే కాదు ఒక వ్యక్తి దైనందిన జీవితానికి సంబంధించి కొన్ని నియమాలను కూడా పొందుపరిచారు. మన సమాజంలో చాలా మందికి ఇతరుల నుంచి వస్తువులు అడిగి వాటిని ఉపయోగించే అలవాటు ఉంటుంది. వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం.. ఈ విధంగా ఇతరుల వస్తువులను తీసుకోవడం, ఇవ్వడం కూడా శుభప్రదంగా పరిగణించబడదు. ఇతరుల వస్తువులను అడిగి తమ కోసం వాడుకునే వారిలో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. ఇలా ప్రతికూల శక్తి ప్రవేశించడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి వస్తువులను ఒకరు తీసుకుని వాడుకున్నప్పుడు.. ఒకరి శక్తులు .. మరొకరిలో ప్రవేశిస్తాయి. ఈ ప్రతికూల శక్తి కారణంగా అనేక కొత్త సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు వాస్తు శాస్త్రం ప్రకారం ఒకరి నుంచి మరొకరు పొరపాటున కూడా తీసుకోకూడని కొన్ని వస్తువులున్నాయి. అవి ఏమిటంటే..
- ఉప్పు: ఉప్పును సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేరొకరు ఉపయోగించే ఉప్పుని అప్పుగా తీసుకుంటే.. ఆ ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకురాగలదు, దీని వలన ఆర్థిక సమస్యలు వస్తాయి.
- నూనె: నూనె శనీశ్వరుడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. వేరొకరి ఇంటి నుంచి అరువు తెచ్చుకున్న నూనె ఇంట్లోకి శని దోషాన్ని తీసుకురాగలదు, దీనివల్ల ఆర్థిక నష్టం జరగవచ్చు.
- సూది: సూదిని ప్రతికూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఒకరి ఇంటి నుంచి సూదిని అడిగి ఇంట్లోకి తీసుకోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుంది. ఇది ఇంట్లో అశాంతికి కారణమవుతుంది.
- రుమాలు: రుమాలు వ్యక్తిగత వస్తువుగా పరిగణించబడుతుంది. వేరొకరు ఉపయోగించే రుమాలు ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకురాగలదు. ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది.
- పెన్ను: పెన్ను జ్ఞానం, అభ్యాసానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వేరొకరు ఉపయోగించిన పెన్ను ఉపయోగించడం వల్ల చదువులో ఆటంకం ఏర్పడుతుంది.
- గడియారం: గడియారం కాలాన్ని సూచిస్తుంది. సమయం కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది. కనుక ఒకరి నుంచి అరువు తెచ్చుకుని గడియారాన్ని ఇంట్లో పెట్టవద్దు. లేదా మరొకరు ధరించే వాచ్ ని ధరించకూడదు.
- ఏదైనా తప్పనిసరి పరిస్థితులతో అప్పు తీసుకున్నప్పుడు.. దానిని గౌరవంగా తిరిగి ఇవ్వండి. ఏదైనా అప్పు ఇచ్చినప్పుడు.. మీరు దానిని తిరిగి పొందగలరని నిర్ధారించుకోండి. ఏదైనా అప్పు తీసుకోవడం చాలా ముఖ్యమైతే.. దానిని కొద్దిసేపు మాత్రమే అప్పుగా తీసుకుని త్వరగా తిరిగి ఇవ్వండి. ఇవి కేవలం నమ్మకాలు అని.. వాటిని నమ్మడం లేదా నమ్మకపోవడం అనేది వ్యక్తిగత ఎంపిక అని గమనించడం ముఖ్యం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు