లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా చేయండి..! ఈ 4 చోట్ల దీపం పెట్టడం మర్చిపోకండి..!
వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకం. శనిదేవుని అనుగ్రహం లభించి, కష్టసమస్యలు తొలగి, శుభఫలితాలు వస్తాయని చెబుతారు. ముఖ్యంగా శని దేవాలయం, హనుమాన్ గుడి, ఇంటి ముఖ ద్వారం, రావి చెట్టు కింద దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా ఉంటుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే అనుకున్న కోరికలు నెరవేరతాయని నమ్మకం. శనిదేవుడి అనుగ్రహం లభించి కర్మ ఫలితాల ప్రభావం తగ్గి శుభ ఫలితాలు అనుభవించవచ్చని పెద్దలు చెబుతారు. ఈ నమ్మకాన్ని అనుసరించి చాలా మంది శనివారం దీపాన్ని వెలిగించేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం శనివారం ముఖ్యంగా ఈ నాలుగు ప్రదేశాల్లో దీపం వెలిగించడం శుభప్రదంగా ఉంటుందట. ఆ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శనిదేవుడు న్యాయదేవతగా భావించబడతాడు. కర్మానుసారం ఫలితాలను అందించే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. శనివారం ఆలయంలో దీపం వెలిగించడం చాలా ముఖ్యమని పెద్దలు చెబుతారు. సాయంత్రం సమయానికి శని దేవాలయానికి వెళ్లి ఆవనూనెతో దీపం వెలిగిస్తే.. పాపపరిహారం జరుగుతుందని గత జన్మ కర్మఫల ప్రభావం తగ్గుతుందని నమ్మకం. దీని వల్ల ఉద్యోగ, వ్యాపార విజయాలు సాధించి ఆరోగ్యపరమైన సమస్యల నుంచి విముక్తి పొందవచ్చని నమ్ముతారు.
హనుమంతుడు శనిదోష నివారకుడిగా ప్రసిద్ధి. శని ప్రభావం తీవ్రంగా ఉన్నవారు హనుమాన్ ఉపాసన చేస్తే సమస్యలు తగ్గుతాయని చెబుతారు. శనివారం హనుమంతుడి గుడికి వెళ్లి అక్కడ దీపం వెలిగించి భక్తితో ప్రార్థిస్తే మనసుకు ప్రశాంతత లభించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నమ్మకం. హనుమంతుని కృప వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగి జీవితంలో అనుకూల మార్పులు వస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇంటి ప్రధాన ద్వారం ఇంటి శక్తిని నియంత్రించే ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం ఇంటి ముఖ ద్వారానికి ఎడమవైపున దీపం వెలిగిస్తే ఇంట్లో శుభ శక్తులు పెరుగుతాయని దోషాలు తగ్గుతాయని నమ్మకం. ఈ దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సిరిసంపదలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మంచిదని ఇల్లు సంతోషంగా ఉంటుందని చెబుతారు.
హిందూ సంప్రదాయం ప్రకారం రావి చెట్టు పవిత్రమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఆధ్యాత్మిక శక్తులు పెరుగుతాయని మనశ్శాంతి లభిస్తుందని చెబుతారు. ఇది పూర్వీకుల ఆత్మలకు శాంతిని అందించేలా చేస్తుందని కూడా నమ్మకం. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శని దోష ప్రభావం తగ్గి కోరికలు నెరవేరతాయని చెబుతారు. శనివారం ఈ ప్రదేశాల్లో దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు సాధించవచ్చని విశ్వసిస్తారు.