AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personality Test: ఈ చిత్రంలోని ఏ వృత్తం మిమ్మల్ని ఆకర్షించింది? ఈ వృత్తంలోనే మీ వ్యక్తిత్వం దాగి ఉంది

వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్రంలో మీరు గమనించే లేదా ఎంచుకునే మొదటి విషయాల ఆధారంగా మీ పాత్ర, వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి. ఈ చిత్రంలో ఆరు రకాల వృత్తాలు ఉన్నాయి. వీటిని దగ్గరగా చూసినప్పుడు.. అక్కడ ఉన్న ప్రతి వృత్తం, రూపకల్పన ప్రత్యేకంగా ఉందనిపిస్తుంది. ఈ సర్కిల్‌లలో మీకు నచ్చిన ఒకదాన్ని ఎంచుకోండి. మీరు ఎంచుకునే సర్కిల్ మీ వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది.

Personality Test: ఈ చిత్రంలోని ఏ వృత్తం మిమ్మల్ని ఆకర్షించింది? ఈ వృత్తంలోనే మీ వ్యక్తిత్వం దాగి ఉంది
Personality Test
Surya Kala
|

Updated on: Mar 23, 2025 | 5:13 PM

Share

ప్రపంచంలో అందరూ ఒకేలా కనిపించరు. అదేవిధంగా అందరి వ్యక్తిత్వం కూడా ఒకేలా ఉండదు. మనుషుల వ్యక్తిత్వంలో చాలా తేడా ఉంటుంది. కొంతమందికి కొందరి వ్యక్తిత్వం నచ్చుతుంది. మరికొందరు పరిస్థితికి అనుగుణంగా ప్రవర్తించే విధానం వల్ల ఇతరులకు దూరంగా ఉంటారు. ఇటీవలి కాలంలో కళ్ళు, చెవులు, ముక్కు వంటి శరీర భాగాల ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని చెబుతున్నారు. కానీ ఈ చిత్రంలో ఆరు వృత్తాలు ఉన్నాయి. మిమ్మల్ని ఆకర్షించే వృత్తాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఆ వృత్తం ఆధారంగా వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చు. ఈ వృత్తాలు మీ గురించి ఎవరికీ తెలియని కొన్ని రహస్య వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తాయి.

వృత్తం 1: మొదటి వృత్తాన్ని ఎంచుకుంటే.. అటువంటి వ్యక్తులు తమ భావాలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. అయితే వీరు స్వతంత్రంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు. తమ జీవితంలోని అనేక అంశాలను ప్రైవేట్‌గా ఉంచడానికి ఇష్టపడతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో తమ సమయాన్ని గడపడమే కాదు..అత్యంత సన్నిహిత వర్గాలను కలిగి ఉంటారు.

వృత్తం 2: రెండవ వృత్తాన్ని ఎంచుకునే వ్యక్తులు అన్ని విషయాలకు తమను తాము పరిశీలించుకుంటూ ఉంటారు. వీరు తమ జీవితంలో స్నేహానికి అధిక విలువనిచ్చే విశాల దృక్పథం కలిగిన వ్యక్తులు. వీరి చుట్టూ ఉన్న ప్రజలు వీరి నిర్భయ వైఖరికితో గౌరవాన్ని పొందుతారు.

వృత్తం 3 : మీరు మధ్యలో చెట్టు ఉన్న మూడవ వృత్త చిత్రాన్ని ఎంచుకుంటే.. ఇలాంటి వ్యక్తులు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు ఉద్దేశపూర్వకంగా తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం ద్వారా ప్రియమైనవారి మధ్య ప్రేమ ఉండేలా కృషి చేస్తారు. ఈ వ్యక్తులు కుటుంబంలోని ప్రతి ఒక్కరితో ఆరాధించబడతారు. తద్వారా అందరి గౌరవాన్ని పొందుతారు.

వృత్తం 4: నాల్గవ వృత్తం చిత్రాన్ని ఎంచుకునే వ్యక్తులు పెద్ద పెద్ద సవాళ్లను సులభంగా స్వీకరించే స్ఫూర్తిని కలిగి ఉంటారు. ఈ చిత్రంలోని కలువ పువ్వు బలం, పట్టుదలకు చిహ్నంగా పనిచేస్తుంది. వృత్తంలోని అనేక పొరలు మీ జీవితంలోని సవాళ్లను సూచిస్తాయి. వీరి జీవితంలో ప్రతిదాన్ని విశాల దృక్పథంతో అంగీకరించే వ్యక్తులు. దృఢ సంకల్పం కలిగి ఉండడంతో విజయాన్ని పొందుతారు. వీరు కష్టపడి పనిచేస్తారు. తమ లక్ష్యాలను సాధించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తారు.

వృత్తం 5: ఒక క్లోజ్డ్ సర్కిల్‌ను ఎంచుకునే వ్యక్తులు చురుకైన వ్యక్తి అని సూచిస్తుంది. వీరు ఒక నిర్దిష్ట ప్రదేశం లేదా వ్యక్తికి అనుబంధంగా ఉండరు. వీరు స్వార్థపూరితంగా ఆలోచిస్తారు.. కనుక ఇతరులను ఉపయోగించుకుని తమ పనిని పూర్తి చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యక్తులు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. అంతే కాదు వీరు కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి ఇష్టపడే వ్యక్తులు.

వృత్తం 6: చివరి వృత్తాన్ని ఎంచుకునే వ్యక్తులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు క్రమశిక్షణ గల జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువలన వీరి జీవితంలో సమతుల్యతను సాధిస్తారు. ప్రపంచాన్ని తమ ప్రత్యేక దృక్కోణంతో విశాలమైన ఊహలతో చూడాలనుకుంటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్