Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఎక్కడ పెట్టాలి.? ఏ దిశలో పెడితే ధన లాభం వస్తుంది.!

ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటి అలంకరణకు విరివిగా మనీ ప్లాంట్‌ను ఉపయోగిస్తున్నారు. మనీ ప్లాంట్ అందంగా ఉంటుంది...

Vastu Tips: ఇంట్లో మనీ ప్లాంట్‌ను ఎక్కడ పెట్టాలి.? ఏ దిశలో పెడితే ధన లాభం వస్తుంది.!
Money Plant
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Nov 06, 2021 | 1:32 PM

ఈ మధ్యకాలంలో చాలామంది ఇంటి అలంకరణకు విరివిగా మనీ ప్లాంట్‌ను ఉపయోగిస్తున్నారు. మనీ ప్లాంట్ అందంగా ఉంటుంది. అలాగే తీగ జాతికి చెందినది, సూర్యరశ్మి లేకపోయినా పెరుగుతుంది కాబట్టి అందరూ దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ డబ్బుకు ప్రతీక. ఏ ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటుందో.. అక్కడ డబ్బుకు కొదవ ఉండదు. సాధారణంగా మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచడం వల్ల వాస్తు దోషాలన్నీ తొలిగిపోతాయని అందరూ విశ్వసిస్తారు. అలాగే ఎలప్పుడూ సిరిసంపదలు, ఆనందం వెల్లు విరుస్తుందని వారి నమ్మకం. మరి వాస్తుశాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఏ దిశలో పెంచితే శుభ ఫలితాలు వస్తాయి.? ఏ దిశలో పెంచితే అశుభ ఫలితాలు వస్తాయి అనే విషయాలను తెలుసుకోండి..

ఇంట్లో శుభాలు కలగాలన్నా.. ధనలాభం పొందాలన్నా.. మనీ ప్లాంట్‌‌ను తూర్పు ఆగ్నేయ దిశలో పెంచాలి. ఆగ్నేయంలో ఫుల్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆగ్నేయ దిశకు వినాయకుడు అధిపతి.. ఈ దిశలో మనీ ప్లాంట్‌ను పెంచితే శుభ ఫలితాలు దక్కుతాయి. అలాగే పొరపాటును కూడా మనీ ప్లాంట్ మొక్కను తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం దిశల్లో పెంచకూడదు. ఇక్కడ పెంచితే అశుభ ఫలితాలు ఉంటాయి.

అలాగే మనీ ప్లాంట్ ఎలప్పుడూ ఇంటి లోపలే పెంచుకోవాలి. ఆ మొక్క తీగ పైపైకి పెరగడం ప్రయోజనకరం.. ఎప్పుడూ దాని తీగను క్రిందికి వేలాడదీయకండి. అలా చేస్తే ఆర్థికంగా నష్టాలు ఏర్పడవచ్చు. కాగా, మనీ ప్లాంట్‌ను నీటి డబ్బా లేదా పెద్ద కుండలో పెట్టి పెంచవచ్చు. తద్వారా దాని శక్తి పూర్తిగా ఇంటి మొత్తానికి వ్యాపిస్తుంది.

Read Also: ఉపకారం మరువని ఉడత… వీడియో చూస్తే మైమరచిపోతారు

డ్రైవర్‌ సీటుకి వెనుకవైపు ఉన్న సందేశం చూసి ఆశ్చర్య పోయిన ప్యాసింజర్.. ఇంతకీ ఆ సందేశం ఏంటో తెలుసా..?? వీడియో

ఫోన్‌లో ఆడుతూ రూ.61 వేలకి ఆర్డర్‌ చేసిన చిన్నారి… పెట్టిన ఆర్డర్ చూసి షాక్ అయిన తల్లిదండ్రులు.. వీడియో

ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్‌ రెస్టారెంట్‌.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??