Diwali 2021 – Ayodhya: రామ జన్మస్థలంలో సరికొత్త రికార్డ్.. కోట్లాది భక్తులు పరవశించిపోయిన అద్భుత దృశ్యం..!
Ayodhya Deepotsav 2021: రామ జన్మస్థలం అయోధ్యలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. ఆ అపురూపమైన దృశ్యాన్ని చూసి కోట్లాదిమంది భక్తులు పరవశించిపోయారు.
Ayodhya Deepotsav 2021: రామ జన్మస్థలం అయోధ్యలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. ఆ అపురూపమైన దృశ్యాన్ని చూసి కోట్లాదిమంది భక్తులు పరవశించిపోయారు. అంతేకాదు.. మునుపెన్నడూ లేనివిధంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఏకంగా గిన్నీ్స్ రికార్డులో చోటు దక్కించుకుంది. అయోధ్య నగరి లక్షల దివ్వెలతో వెలిగిపోయింది. సరయు నది తీరం లక్షల దీపాల వెలుగులో మరింత అందంగా దర్శనమిచ్చింది. ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 12 లక్షల దీపాల వెలుగులో అయోధ్య ఆధ్యాత్మికతను సంతరించుకుంది. దీపావళి పర్వదినం సందర్భంగా ఏర్పాటు చేసిన దీపోత్సవం ఏకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. 12 లక్షల దీపాలు వెలిగించడంతో అయోధ్యలో కొత్త రికార్డ్ నమోదైంది. 12 లక్షల దీపాలతో పాటు అయోధ్యలో ఏర్పాటు చేసిన లేజర్‌షో కూడా భక్తులను అమితంగా ఆకట్టుకుంది. స్థానికులతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు వచ్చిన భక్తులు కూడా ఈ అద్భుత దృశ్యాన్ని చూసి పరవశించిపోయారు.
దీపావళి సందర్భంగా అయోధ్య నగరిని కూడా అందంగా అలంకరించారు అక్కడి అధికారులు. శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు లంక నుంచి అయోధ్య చేరుకున్న దృశ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పుష్పకవిమానంలో అయోధ్యకు శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు రావడం.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికే సన్నివేశం అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. దీపావళి సందర్భంగా అయోధ్యలో ప్రతిఏటా దీపోత్సవం నిర్వహిస్తారు. అయితే ఈసారి 12 లక్షల దీపాలు వెలిగించడంతో ఈ కార్యక్రమం గిన్నిస్ రికార్డ్‌లోకి ఎక్కింది.
Uttar Pradesh sets yet another record by lighting 9,41,551 diyas today in #Ayodhya and enters the Guinness Book of Record.#Deepotsav2021 के अवसर पर राम की पैड़ी पर 9,41,551 दीप प्रज्ज्वलित कर गिनीज बुक ऑफ वर्ल्ड रिकार्ड में नाम दर्ज कराया गया।#DeepotsavInAyodhya #Ayodhya pic.twitter.com/3aGeC5gYmP
— G Kishan Reddy (@kishanreddybjp) November 3, 2021
కాగా, దీపావళి సంబరాలు అయోధ్యలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలువురు కేంద్రమంత్రులు, యూపీ సీఎం యోగి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయోధ్యలో ప్రతి ఏటా ఘనంగా దీపోత్సవ్‌ను నిర్వహిస్తున్న సీఎం యోగిని అభినందించారు కిషన్‌రెడ్డి. అయోధ్యను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. రూ. 600 కోట్లతో అయోధ్యలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని తెలిపారు సీఎం యోగి.
Also read:
Crime News: పొలంలో పనిచేస్తున్న మహిళపై భూస్వామి అత్యాచారం.. మనస్థాపంతో బాధితురాలు అఘాయిత్యం..