AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: పొలంలో పనిచేస్తున్న మహిళపై భూస్వామి అత్యాచారం.. మనస్థాపంతో బాధితురాలు అఘాయిత్యం..

Woman raped by land owner: మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు అమల్లోకి వచ్చినా.. కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో

Crime News: పొలంలో పనిచేస్తున్న మహిళపై భూస్వామి అత్యాచారం.. మనస్థాపంతో బాధితురాలు అఘాయిత్యం..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Nov 04, 2021 | 7:28 PM

Share

Woman raped by land owner: మహిళల భద్రత కోసం ఎన్ని చట్టాలు అమల్లోకి వచ్చినా.. కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ పదుల సంఖ్యలో అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా.. ఓ మహిళా కూలీపై కన్నేసిన యజమాని.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ సంఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. కాగా.. ఆలస్యంగా వచ్చిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేంద్రనగర్ జిల్లా వాధ్వన్ తాలూకాలోని ఓ గ్రామంలో వ్యవసాయ పనులు చేసేందుకు ఓ కుటుంబం అక్కడికి వచ్చి నివాసముంటోంది. ఈ క్రమంలో మహిళ (30) పొలంలో పనులు చేస్తుండగా.. భూ యజమాని యువ‌రాజ్‌సింగ్ ప‌ర్మార్ మ‌హిళ‌ను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొట్టాడు. అడ్డొచ్చిన ఆమె 3 ఏళ్ల కొడుకును కూడా నిందితుడు కొట్టినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో మ‌న‌స్థాపానికి గురైన మ‌హిళ పొలంలోనే ఆత్మహత్య య‌త్నించింది. తీవ్ర గాయాల‌పాలైన ఆమెను భర్త ఆసుపత్రికి తరలించగా.. ఆమె చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. భ‌ర్త ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. రాజ్‌కోట్ నగరంలోని రతన్‌పూర్‌లో నివాసం ఉంటున్న నిందితుడు పర్మార్ గ‌త కొంతకాలంగా మ‌హిళ‌ను త‌న కోరిక తీర్చాల‌ని ఒత్తిడి చేస్తున్నాడ‌ని పోలీసులు తెలిపారు. పార్మర్ పొలంలో దంపతులు కూలీకి పనులు చేస్తున్నారని.. అక్కడే నివాసముంటున్నారని తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడని.. అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు.

Also Read:

Earthquake: గుజరాత్‌లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Hyderabad Crime News: భాగ్యనగరంలో మరో దారుణం.. పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం..

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన