Hyderabad Crime News: భాగ్యనగరంలో మరో దారుణం.. పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం..

Four-year-old girl's suspicious death: హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. పంజాగుట్ట

Hyderabad Crime News: భాగ్యనగరంలో మరో దారుణం.. పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం..
Crime News
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 04, 2021 | 4:29 PM

Four-year-old girl’s suspicious death: హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ద్వారకపురి కాలనీలో టెన్నిస్ కోర్టు దగ్గర షాపు పక్కన గుర్తు తెలియని చిన్నారి మృతదేహం పడిఉంది. అమావాస్య కావడంతో చిన్నారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ చిన్నారిని ఎవరైనా చంపేసి ఇక్కడ వదిలేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. క్షుద్రపూజలు జరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా.. స్థానికుల సమాచారం అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేసుకుని వివరాలు సేకరించారు.

బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్య కేసు నమోదు చేసి.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని.. తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. బాలిక శరీరంపై గాయాలున్నాయి. దీంతో బాలిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read:

Hooch Tragedy: పండుగ పూట విషాదం.. కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృత్యువాత..

Farmhouse Casino: ఫామ్‌హౌస్ క్యాసినో కేసులో వెలుగులోకి సంచలనాలు.. బయటపడుతున్న గుత్తా సుమన్ లీలలు..