Viral Video: వీడు మామూలు దొంగ కాదండోయ్.. చేసింది దొంగతనమైనా విపరీతమైన భక్తి ప్రదర్శించేశాడు..
Robbery in Temple: వీడు మామూలు దొంగ కాదు. చేసేది దొంగతనం.. కానీ అందులో భక్తి, నిజాయితీ రెండూ ఉన్నాయి. తాను చేస్తోంది తప్పు అని తెలిసి ఓ దొంగ.. అమ్మవారికి దండం పెట్టి హుండీలోని..
Robbery in Temple: వీడు మామూలు దొంగ కాదు. చేసేది దొంగతనం.. కానీ అందులో భక్తి, నిజాయితీ రెండూ ఉన్నాయి. తాను చేస్తోంది తప్పు అని తెలిసి ఓ దొంగ.. అమ్మవారికి దండం పెట్టి హుండీలోని డబ్బునంతా ఎత్తుకెల్లాడు ఘరాన దొంగ. ఈ ఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే. ఖమ్మం నగరం 4 డివిజన్‌లో అంకాలమ్మ గుడిలో దొంగతనం జరిగింది. విచిత్రం ఏమిటంటే ఆ దొంగ నిజాయితీతో పాటు.. భక్తిని కూడా ప్రదర్శించాడు. బుధవారం రాత్రి అంకాలమ్మ గుడి తలుపులు తెరిచి లోపలికి వచ్చిన ఓ దొంగ.. అమ్మవారి హుండీ పగలగొట్టి డబ్బులు దోచుకున్నాడు. అయితే, అమ్మవారి మీద భక్తో లేక భయమో గానీ.. దొంగతనం చేయడానికి ముందు అమ్మవారికి దండం పెట్టి క్షమించు తల్లీ అని వేడుకున్నాడు.
ఆ తరువాత తన పని పూర్తి కానిచ్చేశాడు. అయితే, ఈ ఘటన అంతా ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వీడియోను చూసిన నెటిజన్లు.. దొంగపట్ల సానుభూతి చూపుతున్నారు. డబ్బు అవసరం అతనిని ఇలా చేసే పురిగొల్పి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా దొంగ భక్తిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చోరీకి గురైన ఆలయాన్ని పరిశీలించిన పోలీసులు.. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగను వెతికే పనిలో పడ్డారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Hyderabad Crime News: భాగ్యనగరంలో మరో దారుణం.. పంజాగుట్టలో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం లభ్యం..
Akhanda: నెక్స్ట్ లెవల్.. బాలయ్య విశ్వరూపం.. అఖండ టైటిల్ సాంగ్ ప్రోమో అదిరిందిగా..