AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farmhouse Casino: ఫామ్‌హౌస్ క్యాసినో కేసులో వెలుగులోకి సంచలనాలు.. బయటపడుతున్న గుత్తా సుమన్ లీలలు..

ఫామ్‌హౌస్ పేకాట కేసులో కొత్త కథలు బయటికి వస్తున్నాయి. క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌ కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Farmhouse Casino: ఫామ్‌హౌస్ క్యాసినో కేసులో వెలుగులోకి సంచలనాలు.. బయటపడుతున్న గుత్తా సుమన్ లీలలు..
Manchirevula Farmhouse Casino Case
Balaraju Goud
|

Updated on: Nov 04, 2021 | 1:12 PM

Share

Manchirevula Farmhouse Casino Case: ఫామ్‌హౌస్ పేకాట కేసులో కొత్త కథలు బయటికి వస్తున్నాయి. క్యాసినో కింగ్‌పిన్ గుత్తా సుమన్‌ కుమార్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కళావర్ కింగ్‌ నోటి నుంచి క్యాసినో కథ మొత్తం కక్కిస్తున్నారు పోలీసులు. ఎవరెవరితో లింకులున్నాయి. ఏమేం కేసులు ఉన్నాయి. ఫారిన్ క్యాసినోలకు వెళ్లిన ప్రముఖులెవరంటూ ప్రశ్నలతో సుమన్‌ను పేకాటాడేసుకుంటున్నారు హైదరాబాద్ పోలీసులు.

రంగారెడ్డి జిల్లా ఫాంహౌస్‌ పేకాట కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీస్ కస్టడీలో గుత్తా సుమన్‌ సంచలన విషయాలను బయటపెడుతున్నాడు. మొదట, మామిడి తోటలు, హోటల్స్‌లో పేకాట శిబిరాలు నిర్వహించే గుత్తా సుమన్‌… ప్రముఖులు, పలువురు ప్రజాప్రతినిధులతో సుమన్ టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. పేకాటరాయుళ్లను గోవాకు తీసుకెళ్లి క్యాసినో ఆడించేవాడు. గోవాకు తీసుకెళ్లడం ఎందుకు… మనమే నిర్వహిస్తే పోలే అనుకొని ఫామ్‌ హౌస్‌ల్ని ఎంచుకుని క్యాసినోలు నిర్వహించడం మొదలుపెట్టినట్లు ఇంటరాగేషన్‌లో తేలింది.

మంచిరేవుల ఫామ్‌ హౌస్ క్యాసినో వెనుక కూడా పెద్ద కథే నడిచింది. పేకాటరాయుళ్లను, ప్రముఖులను, ప్రజాప్రతినిధులను ఫామ్‌ హౌస్‌కి రప్పించేందుకు గుత్తా సుమన్‌ మామూలు స్కెచ్చేయలేదు. సకల భోగాలను ఎరగా వేశాడు. వాట్సాప్‌ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మినీ క్యాసినోకి రప్పించాడు. ఎంట్రీ ఫీజుగా 20వేలు వసూలుచేసి ఆ తర్వాత అందినకాడికి పిండేసుకున్నాడు. గోవా, శ్రీలంకలో గుత్తా సుమన్ క్యాసినోలు నిర్వహించాడని… తెలుగు రాష్ట్రాల నుంచి పలువురిని క్యాసినోలకు తీసుకెళ్లినట్లు విచారణలో బయటపడింది. నాలుగైదు దేశాల్లోని క్యాసినో క్లబ్స్‌తో గుత్తా సుమన్‌కు లింకులున్నాయ్. సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్, బిజినెస్‌మెన్స్‌లో ఎంతో మందిని కొలంబో, రష్యా, దుబాయ్, చైనా క్యాసినోలకు తీసుకెళ్లి ఆడించాడు. ఇప్పుడీ లిస్ట్‌ను బయటికి తీసే పనిలో పడ్డారు పోలీసులు. మంచిరేవుల పార్టీ తర్వాత 50మందిని రష్యా క్యాసినోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశాడట సుమన్.

గుత్తా సుమన్‌ కేసులన్నింటినీ పోలీసులు తవ్వి తీస్తున్నారు. ఇంటరాగేషన్‌లో గుత్తా సుమన్‌ నేరాల చిట్టా మొత్తం బయటపడుతోంది. రియల్టర్‌గా, బిజినెస్‌మెన్‌గా అవతారమెత్తిన సుమన్‌… అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కాంట్రాక్టుల పేరుతో పలువురిని మోసం చేసినట్లు విచారణలో తేలింది. నార్సింగి పోలీసుల నోటీసులకు హీరో నాగశౌర్య ఫాదర్‌ ఇంకా స్పందించలేదనే సమాచారం అందుతోంది. ఫామ్‌హౌస్ లీజు అగ్రిమెంట్‌ను సమర్పించకపోవడంతో అనుమానాలు రేగుతున్నాయి. ఎన్నిరోజుల నుంచి ఆ ఫామ్‌ హౌస్‌లో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

Read Also…  Crime News: మచిలీపట్నంలో మహిళా కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..