Kedarnath Temple: దీపావళి వేళ దేదీప్యమానంగా వెలుగులీనుతున్న కేధార్‌నాథ్ క్షేత్రం.. చూస్తే వావ్ అనాల్సిందే..

PM Narendra Modi will visit Kedarnath tomorrow: దీపావళి పర్వదినం రోజున చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం రంగురంగుల కాంతులతో

Kedarnath Temple: దీపావళి వేళ దేదీప్యమానంగా వెలుగులీనుతున్న కేధార్‌నాథ్ క్షేత్రం.. చూస్తే వావ్ అనాల్సిందే..
Kedarnath Temple
Follow us

|

Updated on: Nov 04, 2021 | 7:51 PM

PM Narendra Modi will visit Kedarnath tomorrow: దీపావళి పర్వదినం సందర్భంగా చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం రంగురంగుల కాంతులతో మెరిసిపోతోంది. దీపావ‌ళి సంద‌ర్భంగా కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని స‌ర్వాంగ‌సుంద‌రంగా రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆర్తి కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తుల మధ్య వైభవంగా కొనసాగింది. అయితే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. శుక్రవారం కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సంద‌ర్శించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో 8 క్వింటాళ్ల పూలతో ఆల‌యాన్ని సుందరంగా అలంక‌రించారు. అదేవిధంగా రంగురంగుల కాంతుల‌ను వెద‌జ‌ల్లే లైట్లను ఏర్పాటు చేశారు.

ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం కేదర్నాథ్ మంచ్‌దార్‌లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు. ప్రార్థనల అనంతరం మోదీ కొత్తగా నిర్మించిన సద్గురు ఆది శంకరాచార్యుల సమాధిని ప్రారంభిస్తారు. అనంతరం ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు.

250 కోట్లతో చేపట్టిన కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును.. కేదార్నాథ్‌ ఆలయ ప్రాంగంణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 2013 లో వచ్చిన భారీ వరదలకు ఆది శంకరాచార్య సమాధితో పాటు కేదార్‌నాథ్‌లో పలు కట్టడాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వాటిని పునర్నిర్మిస్తున్నారు.

Also Read:

Diwali 2021 – Ayodhya: రామ జన్మస్థలంలో సరికొత్త రికార్డ్.. కోట్లాది భక్తులు పరవశించిపోయిన అద్భుత దృశ్యం..!

Crime News: పొలంలో పనిచేస్తున్న మహిళపై భూస్వామి అత్యాచారం.. మనస్థాపంతో బాధితురాలు అఘాయిత్యం..