Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: నేడు కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ.. 130 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం..

PM Narendra Modi Kedarnath visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని

PM Narendra Modi: నేడు కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోదీ.. 130 కోట్ల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం..
Pm Narendra Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2021 | 7:18 AM

PM Narendra Modi Kedarnath visit: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు చార్‌ధామ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంచ్‌దార్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఉదయాన్నే ప్రధాని మోదీ కేదార్నాథ్ ఆలయానికి పయనమయ్యారు. ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం మోదీ కొత్తగా నిర్మించిన సద్గురు ఆది శంకరాచార్యుల సమాధిని ప్రారంభిస్తారు. అనంతరం ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఉత్తరాఖండ్ చేరుకుంటారని, అక్కడినుంచి కేథర్నాత్ పయనమవుతారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని కొత్తగా నిర్మించిన ఆది శంకరాచార్యుల సమాధి, విగ్రహంతోపాటు సరస్వతి ఘాట్, 130 కోట్ల ఇన్ఫ్రా ప్రాజెక్టులను ప్రారంభిస్తారని ధామి తెలిపారు. దీంతోపాటు కేదార్నాథ్‌ ఆలయ ప్రాంగంణంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు.

2013 లో వచ్చిన భారీ వరదలకు ఆది శంకరాచార్య సమాధితో పాటు కేదార్‌నాథ్‌లో పలు కట్టడాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వాటిని పునర్నిర్మించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో కేదార్నాథ్ ఆలయాన్ని 8క్వింటాళ్ల పూలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. భద్రతా బలగాలను మోహరించి పకడ్బంధీగా ఏర్పాట్లు చేశారు.

Also Read:

Kedarnath Temple: దీపావళి వేళ దేదీప్యమానంగా వెలుగులీనుతున్న కేధార్‌నాథ్ క్షేత్రం.. చూస్తే వావ్ అనాల్సిందే..

Diwali 2021 – Ayodhya: రామ జన్మస్థలంలో సరికొత్త రికార్డ్.. కోట్లాది భక్తులు పరవశించిపోయిన అద్భుత దృశ్యం..!