Vanabhojanam: కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకింద చేసే ని వనభోజనాల.. విశిష్టత ఏమిటంటే..
Vanabhojanam: కార్తీక మాసం మించిన మాసం లేదని పురాణాల కథనం. కార్తీక మాసం వస్తూనే శివకేశవులను ఏకం చేస్తూ పూజలతో సందడి తీసుకొస్తుంది..
Vanabhojanam: కార్తీక మాసం మించిన మాసం లేదని పురాణాల కథనం. కార్తీక మాసం వస్తూనే శివకేశవులను ఏకం చేస్తూ పూజలతో సందడి తీసుకొస్తుంది. ఇక ఈ మాసంలో తెలుగువారి లోగిళ్ళు రోజూ పండగ శోభతో కళాకళాడతాయి. అదే సమయంలో వనభోజనాల సందడి మొదలవుతుంది. ఈ వనభోజనాల ప్రస్తావన అనేక ధార్మిక గ్రంథాలతో పాటు ‘కార్తీక పురాణం’ లో కూడా ఉంది. కార్తీక పౌర్ణమి రోజున నైమిశారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు చేశారట. మునులు ఉసిరి చెట్టుకింద విష్ణువుని ప్రతిష్టించి పూజలను నిర్వహించి.. గోవింద నామస్మరణతో షోడశోపచారాలతో పూజలు చేసి.. అనంతరం వనభోజనాలు చేశారు.అలా మహర్షులు మొదలు పెట్టిన కార్తీకవనభోజనాల కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇలా చాలామంది కార్తీక మాసంలోని వనభోజనాల వేడుకని నిర్వహిస్తారు. ఈ వన భోజనాలు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం,ఆరోగ్యాన్ని ఇస్తాయి.
భారతీయ ఆయుర్వేద వైద్యంలో మొక్కలు ఉన్న ప్రాధ్యాన్యత తెలిసిందే. పూర్వకాలం నుంచి మొక్కలను ప్రకృతి వరంగా భావించి పూజిస్తుంటారు. ఇక ఆయుర్వేదంలో ప్రాముఖ్యమున్న చెట్టు ఉసిరి చెట్టు. కార్తీక మాసంలోని ఉషోద వేళల్లో మంచుకురిసే సమయంలో ఉసిరి చెట్టుకింది విష్ణువుని పూజించి ఆహారం ఆ చెట్టుకింద తినడం వలన పుణ్యమని కార్తీకపురాణం చెబుతుంది. ఈ మాసంలో ఉసిరి చెట్టుకింద విష్ణువుకు చేసే పూజ అశ్వమేధయాగ ఫలాన్ని ఇస్తుందని హిందువుల నమ్మకం
కార్తీక మాసంలోని వనభోజనాలను ఆదివారాలు , ఇతర సెలవు రోజులతో పాటు.. సమీప ఉద్యాన వనాలలో, తోటల్లో, నదీతీర ప్రాంతంలో, సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటారు. పిల్లలు, పెద్దలు సంతోషంగా గడుపుతారు.
Also Read: చైనా ఇక మాకొద్దు బాబోయ్ అంటున్న మరో టెక్ దిగ్గజ సంస్థ.. డ్రాగన్ కంట్రీకి గుడ్ బై