Diwali 2021: పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అయోధ్య.. త్వరలో రామమందిరం నిర్మాణం పూర్తి

Surya Kala

Surya Kala |

Updated on: Nov 04, 2021 | 12:18 PM

Diwali Ayodhya 2021: 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా అయోధ్యను తీర్చిదిద్దుతామని.. త్వరలో రామమందిర..

Diwali 2021: పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అయోధ్య..  త్వరలో రామమందిరం నిర్మాణం పూర్తి
Spiritual Tourism

Diwali Ayodhya 2021: 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశంగా అయోధ్యను తీర్చిదిద్దుతామని.. త్వరలో రామమందిర నిర్మాణం పూర్తి చేస్తమయాని..  రాష్ట్రంలో పర్యాటక అవకాశాలను పెంచుతామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్‌రెడ్డి దీపోత్సవంలో చెప్పారు. అయోధ్యలోని రామ్ కథా పార్కులో శ్రీరాముడి జీవితంపై మూడు పుస్తకాలను ఆవిష్కరించేందుకు రెడ్డి వచ్చారు.

“త్వరలో రామమందిరం నిర్మాణం పూర్తి అవుతుందని.. 2030 నాటికి అయోధ్య ప్రపంచంలోని అతిపెద్ద పర్యాటక నగరాల్లో ఒకటిగా మారుతుందని చెప్పారు.  ప్రపంచవ్యాప్తంగా ప్రజలు రామమందిరాన్ని చూసేందుకు , రాముడిని కొలిచేందుకు నగరాన్ని సందర్శిస్తారని తెలిపారు. దీంతో తర్వాత ఇక్కడ పర్యాటక అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

అయోధ్య అనేది సంకల్పం, వారసత్వం, ఇది ఆధ్యాత్మిక నగరం, ఇది త్వరలో పర్యాటకుల నగరం అవుతుంది” అని కిషన్ రెడ్డి చెప్పారు.”అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించనున్నామని అంతేకాదు అయోధ్యలో రైలు, రహదారి కనెక్టివిటీ కూడా ఉందని చెప్పారు.  నగరం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వం రెండూ కృషి చేస్తున్నాయి. రాబోయే 10 సంవత్సరాలలో అయోధ్యకు వచ్చే పర్యాటకుల సంఖ్య 5 కోట్లకు చేరుకుంటుందని.. అయోధ్య అభివృద్ధి భారతదేశానికి గర్వకారణం అని మంత్రి అన్నారు.

2021 దీపోత్సవం సందర్భంగా సరయు నది ఒడ్డున 9 లక్షల నూనె దీపాలను వెలిగించి.. రాముడి నిరాడంబరతను ప్రపంచానికి చాటి చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు. దీపోత్సవం సందర్భంగా 12 లక్షల నూనె దీపాలు వెలిగించడం ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ నూనె దీపాలు మొత్తం ప్రపంచాన్ని వెలిగిస్తున్నాయని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనా తీరును కొనియాడుతూ.. రాముడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రయత్నిస్తున్నారని, నేడు రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేదని, ప్రజలు ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నారని, ఆయన కృషి, ప్రధాని కారణంగా మంత్రి నరేంద్ర మోడీ దార్శనికత, అయోధ్య నగరం కొత్త మార్గంలో రూపుదిద్దుకుంటోందని తెలిపారు.

 

Also Read:  ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో మేకల వ్యాపారం ప్రారంభిచండి.. రూ.2లక్షలకు పైగా సంపాదించండి

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu