AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goat Farming: ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో మేకల వ్యాపారం ప్రారంభించండి.. రూ.2లక్షలకు పైగా సంపాదించండి

Goat Farming: భారతదేశంలో మేకను 'పేదవారి ఆవు' అని పిలుస్తారు.  ఇక మనదేశంలో మేకల పెంపకం కొత్తకాదు. గ్రామీణ భారతదేశంలోని ప్రజలు..

Goat Farming: ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో మేకల వ్యాపారం ప్రారంభించండి.. రూ.2లక్షలకు పైగా సంపాదించండి
Goat Farming
Surya Kala
| Edited By: |

Updated on: Nov 04, 2021 | 12:03 PM

Share

Goat Farming: భారతదేశంలో మేకను ‘పేదవారి ఆవు’ అని పిలుస్తారు.  ఇక మనదేశంలో మేకల పెంపకం కొత్తకాదు. గ్రామీణ భారతదేశంలోని ప్రజలు ఎప్పటి నుంచో మేకలను పెంచుతున్నారు. మేక పెంపకం ప్రణాళిక ప్రకారం చేపడితే.. మంచి లాభదాయకమైన వ్యాపారం. అంతేకాదు తక్కువ పెట్టుబడితో లాభసాటిగా మార్చుకోవచ్చు. మేకల పెంపకం వల్ల పాలు, పేడ తదితర అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మేకల పెంపకానికి ప్రభుత్వం సబ్సిడీని కూడా ఇస్తుంది. ఈరోజు మేకల పెంపకం.. ప్రభుత్వ ప్రోత్సాహకాలు గురించి తెలుసుకుందాం..

మేకల పెంపకానికి ప్రభుత్వ సహకారం:  మేకల పెంపకాన్ని చేపట్టడం చాలా సులభం. ఎవరైనా  ప్రభుత్వ సహాయంతో దీన్ని ప్రారంభించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించడానికి  స్వయం ఉపాధిని అవలంబించడానికి..ప్రభుత్వాలు పోత్సాహాన్ని ఇస్తున్నాయి. మేకల యజమానులకు 90 శాతం వరకు సబ్సిడీని ప్రభుత్వాలు ఇస్తున్నాయి. అదే సమయంలో భారత ప్రభుత్వం పశుపోషణపై 35% వరకు సబ్సిడీ ఇస్తుంది. మేకల పెంపకం ప్రారంభించడానికి డబ్బులు లేకపోయినా బ్యాంకుల్లో రుణం తీసుకోవచ్చు. మేకల పెంపకం కోసం మీకు రుణం ఇవ్వడానికి నాబార్డ్ అందుబాటులో ఉంది.

మేకల పెంపకానికి అయ్యే ఖర్చు: మేకల పెంపకం చేపట్టే ముందు మీరు తప్పనిసరిగా స్థానం,  ఆహారం, మంచినీరు, అవసరమైన కార్మికుల సంఖ్య, పశువైద్య సహాయం, మార్కెట్ సామర్థ్యం ,  ఎగుమతి సామర్థ్యం గురించి సమాచారంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా భారతదేశంలో మేకకు చాలా డిమాండ్ ఉంది. అదే సమయంలో.. దీని మాంసానికి  దేశీయంగా డిమాండ్ ఉంది. ఇది కొత్త వ్యాపారం కాదు, పురాతన కాలం నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

మేకల పెంపకం ద్వారా సంపాదన: మేకల పెంపకం ప్రాజెక్ట్ చాలా లాభదాయకమైన వ్యాపారం. ఒక నివేదిక ప్రకారం, 18 మేకలపై సగటున రూ .2,16,000 ఆదాయం పొందవచ్చు.

ఢిల్లీలో మేకల పెంపకం శిక్షణ: వాణిజ్యపరంగా మేకలను పెంచాలని ప్లాన్ చేస్తున్నప్పుడు, అధిక దిగుబడిని ఇచ్చే మేలు జాతి మేకలను ఎంచుకోవాలి. మేక సంరక్షణ నిర్వహణ, మేక మేత నిర్వహణ, వ్యాధులు మరియు నియంత్రణ చర్యలు, టీకాలు వేయడం మొదలైన వాటి గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి.

భారతదేశంలో మేకల పెంపకం శిక్షణను అందించే శిక్షణా కేంద్రాల జాబితా :  ఢిల్లీ లోని అల్ హబీబ్ ఆగ్రో ఫామ్స్: N- 106, టాప్ ఫ్లోర్, అబ్దుల్ ఫజల్ ఎన్‌క్లేవ్ 1 జామియా నగర్, ఓఖ్లా, న్యూఢిల్లీ 110025, ఢిల్లీ.

Also Read:   ఈ నెల 9న ఒడిశా పయనంకానున్న సీఎం జగన్.. నవీన్ పట్నాయక్‌తో సమావేశం కానున్న ముఖ్యమంత్రి

ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు