AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: వర్షాకాలంలో ఈ వాస్తు నియమాలు పాటించండి.. ఇంట్లో సానుకూల శక్తిని స్వాగతించండి..

ప్రపంచంలో నాలుగు ఋతులు ఉన్నాయి. అయితే భారతదేశంలో నివసించే ప్రజలు ఈ విషయంలో చాలా ధనవంతులు.. ఇక్కడ ప్రజలు ఆరు రుతువులను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. భారతదేశంలో నివసించే ప్రజలు ప్రతి రుతువును ఆనందిస్తారు. ఇప్పుడు వర్ష ఋతువు రానుంది. అంటే వర్షాకాలం రానుంది. ఈ రుతువు పచ్చదనం, ఆనందం, మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

Vastu Tips: వర్షాకాలంలో ఈ వాస్తు నియమాలు పాటించండి.. ఇంట్లో సానుకూల శక్తిని స్వాగతించండి..
Vastu Tips
Surya Kala
|

Updated on: Jun 21, 2025 | 10:10 AM

Share

ఈ సీజన్‌లో వర్షపు చినుకులు, ప్రకృతి సౌందర్యం చూడటానికి చాలా బాగుంటుంది. అయితే వాస్తు ప్రకారం ఈ సీజన్ రాకముందే మనం కొన్ని ప్రత్యేక సన్నాహాలు చేసుకోవాలి. అప్పుడు వర్షాకాలం కూడా మీ ఇంట్లో ఆనందాన్ని కురిపించగలదు. వర్షం ప్రతికూలత నుంచి ఉపశమనం కోసం.. ఈ సీజన్‌లో మీ ఇంటిని వాస్తుకు అనుకూలంగా మార్చుకోవడానికి ముందుగానే కొన్ని సన్నాహాలు చేసుకోవడం మంచిది. కనుక వాస్తు ప్రకారం ఆ చర్యలు ఏమిటో తెలుసుకుందాం..

నీటి నిల్వకు సిద్ధం కావాలి వాస్తు ప్రకారం.. వర్షాకాలం అంటే వరుణ దేవుడి అనుగ్రహం. హిందూ విశ్వాసాల ప్రకారం వరుణ దేవుడు నీటికి అధిదేవుడు. కనుక వర్షాకాలం ముందు అతని రాకకు సిద్ధం కావడం చాలా ముఖ్యం. దీని కోసం ఇంట్లో నీటి మూలకాన్ని తనిఖీ చేయడం చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం నీటి మూలకం స్థానం ఉత్తరం, ఈశాన్యంగా పరిగణించబడుతుంది. నీటి నిల్వ, ఫౌంటెన్, నీటి వ్యవస్థ, నీటి ట్యాంక్ మొదలైనవి ఈ ప్రాంతాలలో ఉండాలి. అటువంటి పరిస్థితిలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలనుకుంటే ఆ నీటి నిల్వను ఈ దిశలలో చేయాలి. ఇంట్లో వర్షపు నీటి వాలును ఈ దిశలలో చేయాలి. ఈ దిశను శుభ్రంగా, తేలికగా ఉంచడం మంచిది. వర్షాకాలం ముందు ఈ దిశలో ఏదైనా అడ్డంకులు ఉంటే, దానిని తొలగించండి. తద్వారా వర్షపు నీరు ఇక్కడ నిల్వ చేయబడుతుంది. ఈ దిశ శుభ్రంగా ఉంటుంది.

ఇంటికి మరమ్మత్తు వర్షాలకు ముందు రెండవ వాస్తు చిట్కా ఏమిటంటే.. ఇంటికి అవసరమైన మరమ్మతులు చేయించుకోవాలి. గోడలలో పగుళ్లు ఉంటే లేదా ఎక్కడి నుండైనా నీరు కారుతుంటే.. వాటిని సరిచేయండి. వాస్తు ప్రకారం తడిగా ఉన్న గోడలు ప్రతికూలతను గ్రహిస్తాయి. వర్షాకాలం ముందు, నీటి లీకేజీలు లేదా నీటి వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థను తనిఖీ చేయండి.

ఇవి కూడా చదవండి

భూమి వాలు తనిఖీ వర్షాలకు ముందు భూమి వాలును ఖచ్చితంగా తనిఖీ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం నుంచి భూమి వాలు ఉత్తరం నుంచి ఆగ్నేయం లేదా తూర్పు నుంచి పడమర వరకు ఉండాలి. మీ ప్రధాన ద్వారం వద్ద నీరు నిల్వ ఉండకూడదు. ఈ దిశలలో నీరు నెమ్మదిగా బయటకు వెళ్లేలా వాలు ఉండాలి.

ఈ దిశలను తనిఖీ చేయండి ఇంటి దక్షిణ, ఆగ్నేయ దిశలను తనిఖీ చేయండి. ఎందుకంటే ఇది అగ్ని ప్రదేశం. ఇక్కడ నీరు నిల్వ ఉండవద్దు. ఇంటిలోని వస్తువులు లేదా మరమ్మతులు ఈ దిశల్లో అవసరమైతే.. వెంటనే చేయించండి. పొరపాటున కూడా ఈ దిశల్లో నీరు పేరుకుపోనివ్వకండి.

ఇంటిని శుభ్రంగా, పొడిగా ఉంచండి వర్షాకాలంలో ఇంటిని పొడిగా, శుభ్రంగా ఉంచండి. ఇంట్లో తేమ పేరుకుపోకుండా ఉండటానికి, స్వచ్ఛమైన గాలి ప్రసరణ అయ్యేలా ముందుగానే సరి చూసుకోండి.

ఇల్లు మంచి వాసన వచ్చేలా చూసుకోండి వర్షం వల్ల వచ్చే తేమ వాసనను తొలగించడానికి ఇంట్లో తగిన సువాసనలను వాడండి. తేమ వాసన ప్రతికూలతను తెస్తుంది. వర్షాకాలంలో కూడా వాస్తు సానుకూలంగా ఉండేలా ఇంట్లో ముఖ్యమైన నూనెలు, సుగంధ ద్రవ్యాలు లేదా పటికను సువాసనగా ఉంచండి.

వర్షాకాలం ముందే ఇంట్లో ఈ చర్యలన్నీ తీసుకుని ఇంటిని వాస్తు అనుకూలంగా మార్చుకోవడం వలన వర్షా కాలంలో వర్షాలు కురిసే సమయంలో ఇంట్లోకి సానుకూలత ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.