AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ విషయాలలో మహిళల ముందు పురుషులు నిలబడలేరంటున్న చాణక్య..అవి ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఆచార్య చాణక్యుడు పండితుడు, తక్షశిల అధ్యాపకుడు. రాజనీతజ్ఞుడు. చాణక్య తన నీతి శాస్త్రంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను చెప్పాడు. కొన్ని విషయాలలో స్త్రీలు పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తారని చాణక్య నీతి చెబుతుంది. స్త్రీలలో అలాంటి లక్షణాలు ఉండటం వల్ల పురుషుల కంటే భిన్నంగా ఉంటారు. ఆచార్య చాణక్య ఈ విషయాలను చాలా లోతుగా వివరించారు. ఈ విషయాలు నేటికీ ప్రతి ఒక్కరి జీవితంలో వర్తిస్తాయి.

Chanakya Niti: ఈ విషయాలలో మహిళల ముందు పురుషులు నిలబడలేరంటున్న చాణక్య..అవి ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Acharya Chanakya
Surya Kala
|

Updated on: Jun 21, 2025 | 9:01 AM

Share

ఆచార్య చాణక్య రాజకీయాలు, సమాజం, సంబంధాలు, జీవితంలోని సూక్ష్మ నైపుణ్యాలను చాలా లోతుగా అర్థం చేసుకుని వివరించిన పండితుడు. శతాబ్దాల క్రితం ఆయన చెప్పిన విషయాలు నేటికీ అంతే ఖచ్చితమైనవి. ప్రభావవంతమైనవిగా పరిగణించబడుతున్నాయి. చాణక్య నీతిలో జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మార్గాలను సూచించడమే కాదు స్త్రీలు పురుషుల కంటే బలహీనంగా ఉన్న విషయాలను కూడా ఆయన చెప్పారు. పురుషులు శారీరకంగా స్త్రీల కంటే బలంగా ఉంటారని సమాజంలో ఒక అభిప్రాయం. అయితే ఆచార్య చాణక్య స్త్రీలు కొన్ని విషయాల్లో పురుషుల కంటే అధికులని చెప్పారు. స్త్రీలకు కొన్ని విషయాల పట్ల ప్రత్యేకమైన అవగాహన, ఓర్పు, అవగాహన ఉంటుంది. అవి పురుషులలో కనిపించడం బహు అరుదని చెప్పాడు. ఆచార్య చాణక్య స్త్రీలను పురుషుల కంటే ఎక్కువ సమర్థులుగా అభివర్ణించిన విషయాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవి ఏమిటంటే..

భావోద్వేగ అవగాహన, ఓర్పు ఆచార్య చాణక్యుడి ప్రకారం మహిళలు భావోద్వేగపరంగా చాలా బలంగా ఉంటారు. పురుషులు చిన్న విషయాలకు కోపం తెచ్చుకుంటారు లేదా ధైర్యం కోల్పోతారు. మహిళలు ఎటువంటి సమస్యలు వచ్చినా.. నిశ్శబ్దంగా భరిస్తారు. వీరు తమ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా రెడీ అవుతారు. సులభంగా త్యాగాన్ని చేస్తారు. ఇంటి ఆర్థిక పరిస్థితి చెడుగా ఉన్నా లేదా ఏదైనా సంక్షోభం వచ్చినా.. మహిళలు ప్రతిదీ నిశబ్దంగా భరిస్తారు. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు.

తెలివి తేటలు చాణక్య నీతిలో మహిళలు తమ తెలివితేటలతో ఎలాంటి క్లిష్ట పరిస్థితి నుంచి అయినా బయటపడగలరని చెప్పబడింది. ఎప్పుడు ఏమి చెప్పాలో, పరిస్థితిని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో స్త్రీలకు బాగా తెలుసు. పురుషులు తరచుగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు. చివరికి నష్టాలను చవిచూస్తారు.

ఇవి కూడా చదవండి

రాజీ పడే సామర్థ్యం సంబంధాలను కొనసాగించడానికి మహిళలే ఎక్కువగా రాజీ పడతారని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు. ప్రతి సంబంధాన్ని కలిపి ఉంచే కళ వారికి తెలుసు. భార్యాభర్తల మధ్య గొడవ అయినా, అత్తగారు, కోడలు మధ్య గొడవ అయినా, మహిళలు ప్రతి పరిస్థితిని ఓపికగా భరిస్తారు.. బంధాలు బలపడేలా చూస్తారు. మరోవైపు, పురుషులు త్వరగా విసుగు చెందుతారు లేదా దూరంగా ఉంటారు.

కుటుంబాన్ని, సమాజాన్ని అనుసంధానించే శక్తి ఆచార్య చాణక్యుడు ఒక స్త్రీ మొత్తం కుటుంబాన్ని కలిపి ఉంచగలదని నమ్మాడు. తెలివైన , సంస్కారవంతురాలైన స్త్రీ తన భర్త, పిల్లలు, అత్తమామలు, ఇతర బంధువులను కలిపి ఉంచుతుంది. ఆమె ఆప్యాయత, కరుణ, సేవాభావం కుటుంబాన్ని బలోపేతం చేస్తాయి. పురుషుడు బయట ఎంత సంపాదించినా.. ఇంట్లో ఉన్న స్త్రీ తెలివైనది కాకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమవుతుంది.

క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు ఆచార్య చాణక్యుడు మహిళలు జీవితంలో ఎటువంటి సంక్షోభభం తలెత్తినా.. ఎటువంటి పరిస్థితి ఏర్పడినా తమ సహనం కోల్పోరని చెప్పారు. కష్ట సమయాల్లో కూడా స్త్రీలు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు.

వాక్చాతుర్యం, ప్రవర్తనలో ప్రావీణ్యం చాణక్య నీతి ప్రకారం స్త్రీలు మాటలను చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగిస్తారు. మహిళలకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. అందుకే వీరు తమ ప్రవర్తనతో ఇతరులను త్వరగా ఆకట్టుకుంటారు, అయితే ఇందుకు విరుద్దంగా పురుషులు కొన్నిసార్లు నేరుగా, కఠినంగా మాట్లాడటం ద్వారా ఎదుటి వ్యక్తిని బాధపెడతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.