Lucky Moles on Your Body: అదృష్టాన్ని తెలియజేసే పుట్టుమచ్చలు శరీరంపై ఏ భాగాలపై ఉంటాయంటే..
పురాతన కాలం నుంచి శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఒక వ్యక్తి అదృష్టం, భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం మానవుడి జాతకాన్ని నిర్థేశించడంలో పుట్టుమచ్చలదీ ఓ పాత్ర అని చెప్పవచ్చు. శరీరంలోని వివిధ భాగాలపై ఉన్న పుట్టుమచ్చలు వ్యక్తుల స్వరూప స్వభావాలను తెలుపడంతో పాటు కొన్ని ప్రత్యేక సూచనలను ఇస్తాయి. ఇవి ఒక వ్యక్తి వ్యక్తిత్వం, సంపద, ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి. అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి.

శరీరంపై పుట్టుమచ్చలు కేవలం అందానికి గుర్తు మాత్రమే కాదు. అవి అదృష్ట.. దురదృష్టాలకు కూడా సంకేతం. సాముద్రిక శాస్త్రం, జ్యోతిష్యం ప్రకారం శరీరంలోని కొన్ని భాగాలపై పుట్టుమచ్చలు ఉండటం శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇవి మానుషి ఉజ్వల భవిష్యత్తు, సంపద, కీర్తి , ఆనందాన్ని సూచిస్తాయి. శరీరంలో ఏ ప్రదేశాలలో పుట్టుమచ్చలు ఉండటం శుభప్రదంగా, అదృష్టంగా పరిగణించబడుతుందో తెలుసుకుందాం.
ఏ శరీర భాగాలపై పుట్టుమచ్చలుంటే శుభప్రదంగా భావిస్తారంటే
నుదిటిపై ఉన్న పుట్టుమచ్చ ఎవరికైనా నుదిటి కుడి వైపున పుట్టుమచ్చ ఉంటే..అది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తులు ధనవంతులు, విజయవంతమైనవారు, సామాజికంగా గౌరవించబడతారు. వీరు తమ కృషి, అంకితభావంతో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మరోవైపు నుదిటి ఎడమ వైపున ఉన్న పుట్టుమచ్చ కొంతవరకు దుబారా చేసే స్వభావాన్ని సూచిస్తుంది.
కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ రెండు కనుబొమ్మల మధ్యలో పుట్టుమచ్చ ఉండటం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అలాంటి వ్యక్తులు పదునైన తెలివితేటలు కలిగి ఉంటారు. దూరదృష్టితో పని చేస్తారు. వీరు ప్రశాంత స్వభావం కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక ధోరణి కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరతను ఎదుర్కోవాల్సిన అవసరం కలుగదు
ముక్కు మీద పుట్టుమచ్చ ముక్కు మీద పుట్టుమచ్చ ఉండటం కూడా అదృష్టానికి సంకేతం. ముక్కు చివర పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు తరచుగా ప్రయాణించడానికి ఇష్టపడతారు. వీరు తమ జీవితంలో చాలా ప్రయాణాలు చేస్తారు. అలాంటి వ్యక్తులు ఉల్లాసంగా , శక్తివంతంగా ఉంటారు. వీరు తాము చేసే వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు.
పెదవి పైన పుట్టుమచ్చ పై పెదవి కుడి వైపున ఉన్న పుట్టుమచ్చ ఆ వ్యక్తి స్వభావరీత్యా చాలా ఆప్యాయంగా, ఉదారంగా ఉంటాడని సూచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఇతరులకు సహాయం చేస్తారు. దయతో ఉంటారు. వీరికి జీవితంలో చాలా ప్రేమ, గౌరవం లభిస్తుంది.
అరచేతిలో పుట్టుమచ్చ వ్యక్తి కుడి అరచేతిలో ముఖ్యంగా ఉంగరపు వేలు లేదా చిటికెన వేలు కింద పుట్టుమచ్చ ఉంటే.. అది సంపద , అదృష్టానికి సూచిక. అలాంటి వ్యక్తులు ఆర్థికంగా బలంగా ఉంటారు . జీవితంలో అన్ని సౌకర్యాలను పొందుతారు. మరోవైపు ఎడమ అరచేతిలో ఉన్న పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కొంచెం కష్టపడవచ్చు. అయితే వీరు చివరికి విజయం సాధిస్తారు.
అరికాళ్ళపై పుట్టుమచ్చ అరికాళ్ళపై పుట్టుమచ్చ ఉండటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇలాంటి ప్లేస్ లో పుట్టుమచ్చ ఉన్నవారు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. వీరు ధైర్యంగా ఉంటారు. సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడరు. వీరు సమాజంలో గౌరవం పొందుతారు.
కడుపు మీద పుట్టుమచ్చ కడుపుపై ఉన్న పుట్టుమచ్చలు సంపద , మంచి ఆహారం పట్ల మక్కువను సూచిస్తాయి. పుట్టుమచ్చ నాభి దగ్గర ఉంటే.. ఆ వ్యక్తి సంపదను పొందుతాడు . సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతాడు. అయితే కొన్ని సందర్భాల్లో కడుపు మీద పుట్టుమచ్చ అతిగా తినే అలవాటును కూడా సూచిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.







