AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Day: యోగా అంటే ఏమిటి? మొదటి యోగా గురువు ఎవరు? ఏఏ గ్రంథాల్లో యోగా ప్రస్తావన ఉందంటే..

దేశం మొత్తం ఈ రోజు (జూన్ 21న) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఇది 2015లో ప్రారంభించబడింది. యోగా అంటే చేరడం.. అంటే ఆధ్యాత్మికంగా శరీరం , మనస్సుల కలయిక. లేదా ఏకీకృతం కావడం. యోగా అనేది శరీరం, మనస్సును ఆరోగ్యంగా మార్చగల కళ. యోగా ద్వారా శారీరక మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ విషయాన్నీ యావత్ ప్రపంచం అంగీకరించిన నిజం. అయితే అసలు మొదట యోగా ఎవరు చేశారు అంటే ఆది యోగి ఎవరో తెలుసా..

Yoga Day: యోగా అంటే ఏమిటి? మొదటి యోగా గురువు ఎవరు? ఏఏ గ్రంథాల్లో యోగా ప్రస్తావన ఉందంటే..
Yoga Day
Surya Kala
|

Updated on: Jun 21, 2025 | 7:05 AM

Share

నేడు ప్రపంచం మొత్తం యోగా చేయడంలో ఉన్న గొప్పదనాన్ని అంగీకరిస్తుంది. అయితే యోగా జన్మస్థలం భారతదేశం. మన దేశంలో పుట్టిన యోగాకి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటున్నారు. నేడు ప్రపంచం మొత్తం యోగా శక్తిని గుర్తించింది. యోగా అనేది భారతదేశ శతాబ్దాల నాటి సంప్రదాయం లేదా అది యుగాల నాటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేడు యోగా ప్రతి ఒక్కరికీ వారి శరీరం, మనస్సును అర్థం చేసుకునే కళగా అవతరించింది.

నేటి యోగాకు ఏ మతం లేకపోవచ్చు. అయితే యోగా మూలాలు హిందూ మతంతో ముడిపడి ఉన్నాయి. దాని రుజువు వేదాలు, పురాణాలలో కనిపిస్తున్నాయి. హిందూ మతంలోని దేవుళ్లే దాని సృష్టికర్తలు. ఈ కళను సృష్టించిన దేవుడు ఎవరు. ఈ రోజు మనం తెలుసుకుందాం..

యోగా అంటే ఏమిటి? యోగా అనేది మీ శరీరం, ఆత్మను సమతుల్యం చేసే కళ. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ మనస్సును ప్రశాంతపరిచే కళ. యోగా కేవలం ఒక వ్యాయామం కాదు.. యోగా ఒక ఆధ్యాత్మికత. ఇది మనిషి శరీరం, మనస్సు మధ్య సామరస్యాన్ని స్థాపించే కళ. భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. యోగా మనకు శరీరం, ఆత్మను సమతుల్యంగా ఉంచే జ్ఞానాన్ని ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

యోగా చరిత్ర యోగా చరిత్ర చాలా పురాతనమైనది. యోగా ప్రాచీన భారతదేశం నుంచి వచ్చింది. దీని మూలం మరియు చరిత్ర సింధు సరస్వతి నాగరికతకు ముందే ఉందని నమ్ముతారు. ఈ యోగా 5000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెబుతారు. యోగా వేద యుగం ఇచ్చిన బహుమతి. దీని ఆధారాలు సింధు లోయ నాగరికతలో కూడా కనిపిస్తాయి.

యోగా ఏ మత గ్రంథాలకు అనుసంధానించబడి ఉన్నదంటే ఋగ్వేదంలో కూడా యోగా ప్రస్తావన ఉంది. వేదాలు,పురాణాలతో పాటు, ఉపనిషత్తులు, మహాభారతం, భగవద్గీతలలో కూడా యోగా గురించి చర్చించబడింది. జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మ యోగం, రాజ యోగం భగవద్గీతలో ప్రస్తావించబడ్డాయి. యోగా ప్రాథమిక రూపం చాలా సూక్ష్మమైన శాస్త్రం. యోగాకి నిజమైన అర్ధం ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. యోగా అనేది ఆత్మ సాక్షాత్కారం. యోగా చరిత్ర మన పురాణ గ్రంథాలలో దాగి ఉంది.

మొదటి యోగి ఎవరు? శివుడు స్వయంగా యోగాలో మొదటి యోగి. అందుకనే శివుడిని ఆది యోగి అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, శివుడు మొదట యోగి. మొదటి యోగా గురువు. హిమాలయాలలోని కాంతి సరోవర్ సరస్సు ఒడ్డున ఆదియోగి శివుడు. ఈ జ్ఞానాన్ని మొదట పురాణ సప్త ఋషులకు అందించాడని నమ్ముతారు. తరువాత ఈ ఏడుగురు ఋషులు యోగా అనేక విభాగాలను సృష్టించారు. యోగా అనేది స్వీయ-సాక్షాత్కార కళ. శివుడి కంటే స్వీయ-సాక్షాత్కారాన్ని ఎవరు బాగా తెలుసుకోగలరు. హాలాహలాన్ని తన గొంతులో దాచిన గరళకంఠుడు,గంగను తన జటాజూటం లో బందిమ్చియన్ జంగమయ్య మాత్రమే యోగాకు తండ్రి. శివుడు మాత్రమే తన శరీరం, మనస్సు మధ్య సామరస్యాన్ని ఏర్పరచగలడు. శివుడి నటరాజ విగ్రహాలు, శివుడి భంగిమలు అన్నీ శివుడు మొదటి యోగి అని రుజువు చేస్తాయి. శివుడు యోగా కళకు తండ్రి. , శివుడే యోగా .. యోగాయే శివతత్వం.. రెండూ ఒకదానికొకటి పూరకంగా ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.