AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Yoga Day: యోగా డే రోజున ఆరోగ్యం, మోక్షం కోసం శక్తివంతమైన శివ యోగాసనాల గురించి తెలుసుకుందాం.. ఎలా చేయాలంటే..

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నేడు జరుపుకుంటున్నాం. యోగా డే సందర్భంగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. ఆధ్యాత్మిక పురోగతి వైపు నడిపించే శక్తివంతమైన యోగాసనాలను గురించి తెలుసుకుందాం.. శివ సంప్రదాయంతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేక ఆసనాలు ఇచ్చే ప్రయోజనాలు ఏమిటంటే..

International Yoga Day: యోగా డే రోజున ఆరోగ్యం, మోక్షం కోసం శక్తివంతమైన శివ యోగాసనాల గురించి తెలుసుకుందాం.. ఎలా చేయాలంటే..
Divine Shiva Yoga AsanasImage Credit source: AI
Surya Kala
|

Updated on: Jun 21, 2025 | 7:40 AM

Share

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటున్నాం. శారీరక బలం, వశ్యతను పెంచే రోజు మాత్రమే కాదు.. ఆత్మను మేల్కొల్పే అవకాశం కూడా యోగాతో ఉంది. ఈసారి “శివ సాధన”కి సంబంధించిన నాలుగు దివ్య యోగాసనాలను అభ్యసించడం ద్వారా యోగా దినోత్సవాన్ని మరింత ప్రత్యేకంగా చేసుకోండి. ఈ యోగాసనాలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని అందించడమే కాదు ఆధ్యాత్మిక పురోగతికి కూడా దారితీస్తాయి. శివ సంప్రదాయంతో ముడిపడి ఉన్న ఈ ప్రత్యేక ఆసనాల గురించి తెలుసుకుందాం.

శివలింగ చేతి ముద్ర: ఏకాగ్రత, అంతర్గత శాంతికి చిహ్నం. శివలింగ హస్త ముద్ర అనేది శక్తివంతమైన చేతి ముద్ర. ఇది ఏకాగ్రతను పెంచడంలో , అంతర్గత శాంతిని సాధించడంలో సహాయపడుతుంది. ఈ ముద్ర శివుని శక్తి రూపాన్ని వర్ణిస్తుంది.

ఎలా చేయాలంటే మీ కుడి చేతితో పిడికిలిని పట్టుకుని, బొటనవేలు నిటారుగా పైకి చూపండి. మీ ఎడమ అరచేతిని కుడి పిడికిలి కింద ఉంచండి. మీరు పిడికిలికి మద్దతు ఇస్తున్నట్లుగా.. ఈ ముద్రను మీ నాభి దగ్గర లేదా మీ గుండె దగ్గర పట్టుకోండి. మీ కళ్ళు మూసుకుని నెమ్మదిగా, లోతైన శ్వాసలను తీసుకోండి. కొన్ని నిమిషాలు ఈ ముద్రలో ఉండి.. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచండి.

ఇవి కూడా చదవండి

నటరాజసన భంగిమ: సమతుల్యత, వశ్యత నృత్యం.. దీనిని ‘నృత్య రాజు భంగిమ’ అని కూడా పిలువబడే నటరాజసనం, విశ్వ నృత్యానికి ప్రతీక అయిన శివుని నటరాజ రూపానికి అంకితం చేయబడింది. ఈ ఆసనం సమతుల్యత, వశ్యత, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.

ఎలా చేయాలంటే.. తడసనంలో నిలబడండి (నిటారుగా నిలబడండి). మీ బరువును ఎడమ కాలు వైపుకు మార్చి కుడి మోకాలిని వంచండి. కుడి చేతితో కుడి చీలమండ లేదా పాదం పైభాగాన్ని పట్టుకోండి. గాలి పీల్చుకుంటూ, కుడి కాలును పైకి ఎత్తి శరీరాన్ని ముందుకు వంచండి. ఎడమ చేతిని ముందుకు నిటారుగా చాచండి (జ్ఞాన ముద్రలో కూడా ఉంచవచ్చు). సమతుల్యతను కాపాడుకుంటూ.. కొంతసేపు ఈ స్థితిలో ఉండండి. శ్వాస వదులుతూ ప్రారంభ స్థానానికి తిరిగి వచ్చి, మరొక వైపు పునరావృతం చేయండి.

హనుమానాసన భంగిమ: బలం, అంకితభావానికి చిహ్నం. హనుమాన్ ఆసనము, లేదా ‘హనుమంతుని భంగిమ’, బలం, భక్తి ,నిస్వార్థ సేవకు ప్రతీక అయిన హనుమంతుని దుమికీని వర్ణిస్తుంది. ఈ ఆసనం కాళ్ళు , తుంటికి తీవ్రమైన సాగతీతను తెస్తుంది.

ఎలా చేయాలి? అధోముఖ స్వనాసనతో ప్రారంభించండి. అశ్వ సంచాలనసన (లో లంజ్)లో లాగా కుడి పాదాన్ని ముందుకు తీసుకువచ్చి రెండు చేతుల మధ్య ఉంచండి. రెండు కాళ్ళు దాదాపు నిటారుగా ఉండే వరకు ఎడమ పాదాన్ని వెనుకకు జారేటప్పుడు.. కుడి పాదాన్ని నెమ్మదిగా ముందుకు జారండి. అపుడు మీ తుంటిని నేలకు తీసుకురావడానికి ప్రయత్నించండి. అయితే ఇలా మీకు సౌకర్యంగా ఉన్నంత వరకు మాత్రమే. చేతులను నేలపై ఉంచి లేదా ప్రార్థన భంగిమలో ఛాతీ ముందుకి తీసుకురండి. కొన్ని లోతైన శ్వాసలను తీసుకొని ఆ భంగిమను కాసేపు పట్టుకోండి. నెమ్మదిగా ప్రారంభ స్థానానికి తిరిగి వచ్చి మరొక వైపు పునరావృతం చేయండి.

ధ్యాన ముద్ర (శివ ధ్యానం): విముక్తి వైపు ఒక అడుగు. ‘ధ్యాన ముద్ర’ అనేది ఒక నిర్దిష్ట భంగిమ కానప్పటికీ.. ఇది శివ సాధనలో అంతర్భాగం. దీనిని పద్మాసన లేదా సుఖాసన వంటి ఏదైనా సౌకర్యవంతమైన ధ్యాన భంగిమలో కూర్చోవడం ద్వారా చేయవచ్చు. ఈ ధ్యానం ఉద్దేశ్యం మనస్సును ప్రశాంతపరచడం. శివుని దివ్య రూపంతో అనుసంధానించడం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.