AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puran: దహన సంస్కారాల తర్వాత స్మశానం నుంచి వస్తూ తిరిగి చూడడం అశుభం.. ఎందుకంటే

పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు ఇది ప్రకృతి నియమం. ఇది జీవితంలో ఒక అనివార్యమైన భాగం. గరుడ పురాణం భౌతిక దేహానికి చివరి కర్మలను చేసిన తర్వాత ఎప్పుడూ శ్మసనాంలో వెనక్కి తిరిగి చూడకూడదు. దీని వెనుక చాలా ఆసక్తికరమైన, భావోద్వేగ కారణం దాగి ఉంది. అటువంటి పరిస్థితిలో ఇలా ఎందుకు చేయాలి? ఒకవేళ పొరపాటున వెనక్కి తిరిగి చూస్తే ఏమి చేయాలో తెలుసుకుందాం.

Garuda Puran: దహన సంస్కారాల తర్వాత స్మశానం నుంచి వస్తూ తిరిగి చూడడం అశుభం.. ఎందుకంటే
Garuda Puran
Surya Kala
|

Updated on: Jun 21, 2025 | 9:46 AM

Share

జీవన మరణ చక్రం ఈ ప్రపంచంలో అచంచలమైన సత్యం. ఈ భూమిపై జన్మించిన ఏ జీవికి అయినా.. ముగింపు ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. హిందూ మతంలో జీవితానికి సంబంధించిన 16 ఆచారాలు ఉన్నాయి . వాటిలో అంతిమ ఆచారాలు అత్యంత ముఖ్యమైనవి. ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి. ఎవరైనా మరణించిన అతని భౌతిక కాయం ఆచారాల ప్రకారం దహనం చేయబడుతుంది. దీని వెనుక ఆధ్యాత్మిక నమ్మకం దాగి ఉంది. పురాణ గ్రంథాల ప్రకారం మరణం తర్వాత వ్యక్తి శరీరం ఐదు అంశాలలో కలిసిపోతుంది. కానీ ఈ ప్రక్రియలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం అవసరం. వాటిలో ఒకటి స్మశానవాటిక నుంచి తిరిగి వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. గరుడ పురాణం ప్రకారం అంతిమ సంస్కారాల తర్వాత ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదు. దీని వెనుక ఉన్న కారణం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో స్మశానవాటికలో అంత్యక్రియలు ముగిసిన అనంతరం వెళ్ళినవారు వెనక్కి తిరిగి చూడవద్దు. ఎందుకంటే

స్మశానవాటిక నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు? ఎవరైనా తమ బంధువు లేదా సన్నిహితుడి అంత్యక్రియలు నిర్వహించడానికి స్మశానవాటికకు వెళ్ళినప్పుడు.. మరణించిన వ్యక్తి ఆత్మ కూడా ఆ సమయంలో అక్కడే ఉంటుంది. ఆత్మ తన ప్రియమైనవారి నుంచి విడిపోయినందుకు భావోద్వేగానికి గురవుతుందని, వారితో ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటుందని నమ్ముతారు. అందుకే అంత్యక్రియల అనంతరం స్మశానవాటిక నుంచి తిరిగి వస్తూ ఎవరైనా వెనక్కి తిరిగి చూస్తే.. ఆ తో మరణించిన వ్యక్తి ఉన్న అనుబంధం కారణం..గా మరణించిన వ్యక్తి ఆత్మ అతనిని అనుసరించవచ్చు. కనుక ఇది ఆత్మ మోక్షాన్ని పొందడంలో ఒక అడ్డంకిగా పరిగణించబడుతుంది. అందువల్ల అంత్యక్రియలు పూర్తయిన వెంటనే.. ఆత్మకి ఎటువంటి బంధం లేకుండా తన తదుపరి ప్రయాణాన్ని పూర్తి చేసుకునేలా ఉండాలంటే.. వెనక్కి తిరిగి చూడకుండా నిశ్శబ్దంగా స్మశానం నుంచి ఇంటికి తిరిగి రావాలని చెబుతారు.

దహన సంస్కారాల సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హిందూ మతంలో అంత్యక్రియలను జరిపేందుకు అనేక నియమాలు ఉన్నాయి. అన్నింటికంటే ముందు మృతదేహానికి మంచి, శుభ్రమైన దుస్తులను ధరింపజేయాలి. మృతదేహాన్ని ఎప్పుడూ బట్టలు లేకుండా చితిపై ఉంచకూడదు. పువ్వులు, గంధపు చెక్క, ఐదు రకాల కలపను చితిపై ఉంచుతారు. మృతదేహాన్ని చితిపై ఉంచేటప్పుడు కుటుంబ సభ్యులు భక్తితో ఆ మృతదేహానికి ప్రదక్షిణలు చేయాలి. ఇది అంతిమ వీడ్కోలుకు చిహ్నం. ఇలా చేయడం ద్వారా చనిపోయిన ఆత్మకు శాంతి లభిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా మానసిక సంతృప్తిని పొందుతారు.

ఇవి కూడా చదవండి

అనుకోకుండా వెనక్కి తిరిగితే ఏమి చేయాలి? స్మశానం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎవరూ వెనక్కి తిరిగి చూడకుండా చూసుకోవాలి. అయితే ఏదైనా కారణం చేత ఇలా జరిగితే.. కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత.. నిప్పుల సెగ తగిలేలా కాళ్ళు, చేతులను ఉంచాలి. ఇలా నిప్పుల నుంచి వచ్చే వేడితో చేతులు, కాళ్ళను వేడి చేయాలనీ గ్రంథాలలో చెప్పబడింది. తరువాత రాయి, ఇనుము, నీటిని తాకాలి. దీని తరువాత వేప ఆకులు లేదా పచ్చి మిరపకాయలను నమిలి ఉమ్మివేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత వెంటనే స్నానం చేయాలి. తద్వారా ఎలాంటి ప్రతికూల శక్తి శరీరంలోకి లేదా ఇంట్లోకి ప్రవేశించదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.