AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Numerology: ఈ 3 తేదీల్లో జన్మించిన వారు ఎప్పుడూ కోపంతో ఉంటారు.. సాయం చేసే గుణం వీరి సొంతం

కొంత మంది జ్యోతిష్యం ద్వారా భవిష్యత్ ని, వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటే.. మరికొందరు సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకుంటారు. సంఖ్యాశాస్త్రం అంటే మనిషి జీవితాన్ని ప్రభావాలను అధ్యయనం చేసే ఒక పద్ధతి. ఇది సంఖ్యలు, వ్యక్తిత్వం, సంఘటనలు, ఇతర విషయాల మధ్య సంబంధాలను పరిశీలిస్తుంది. ఈ రోజు ఈ రోజు కొన్ని తేదీల్లో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకుందాం. వీరు చాలా సహాయకారిగా ఉంటారు. అయితే వీరి స్వభావం, జీవితం గురించి వివరంగా తెలుసుకుందాం.

Numerology: ఈ 3 తేదీల్లో జన్మించిన వారు ఎప్పుడూ కోపంతో ఉంటారు.. సాయం చేసే గుణం వీరి సొంతం
Numerology
Surya Kala
|

Updated on: Jun 21, 2025 | 11:23 AM

Share

ప్రతి వ్యక్తి పుట్టిన తేదీలో రోజు, నెల, సంవత్సరం మాత్రమే కాదు అతని స్వభావం, ఆలోచనా విధానం, ప్రత్యేక జీవన విధానం కూడా దాగి ఉన్నాయి. సంఖ్యాశాస్త్రం ఈ రహస్యాన్ని వెల్లడించే ఒక పురాతన శాస్త్రం. సంఖ్యాశాస్త్రం ప్రకారం మనం పుట్టిన తేదీ అంకెలను జోడించినప్పుడు.. మన జీవిత ముగింపు అయిన రాడిక్స్ అని పిలువబడే ఒక మూల సంఖ్య మనకు లభిస్తుంది. ఈ రాడిక్స్ 1 నుంచి 9 వరకు ఏదైనా కావచ్చు. అలాగే ప్రతి సంఖ్య ఒక నిర్దిష్ట గ్రహంతో ముడిపడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు నెలలో ఈ 3 తేదీలలో జన్మించిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం.. వీరి స్వభావం అత్యంత కోపం. కనుక ఈ మూడు తేదీలలో జన్మించిన వ్యక్తుల జీవితం గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇవి మూలాలు , పుట్టిన తేదీ సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలోనైనా 9, 18 , 27 తేదీలలో జన్మించిన వ్యక్తుల రాడిక్స్ సంఖ్య అంటే మూల సంఖ్య 9 గా ఉంటుంది. ఈ రాడిక్స్ సంఖ్య ఉన్న వ్యక్తుల పాలక గ్రహం కుజుడు.

9వ సంఖ్య ఉన్న వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే 9వ రాడిక్స్ సంఖ్య గల వ్యక్తుల స్వభావం అత్యంత కోపం. వీరికి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. చిన్న చిన్న విషయాలకే కోపాన్ని వ్యక్తం చేస్తారు. కోపంగా ఎల్లప్పుడూ కనిపిస్తారు. అదే విధంగా వీరి కోపం క్షణంలోనే తగ్గిపోతుంది. తర్వాత తమ కోపానికి మనస్తాపం చెందుతారు. అయితే.. వీరు ఎప్పుడూ కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు.

ఇవి కూడా చదవండి

అందరికీ సహాయం చేసే గుణం 9 మూల సంఖ్య ఉన్న వ్యక్తులు చాలా సహాయకారిగా ఉంటారు. ఎవరైనా అవసరంలో ఉంటే..నేను ఉన్నా అంటూ ఆదుకుంటారు. ప్రతి ఒక్కరికీ సహాయం చేయడానికి ఇష్టపడతారు. వీరు తమ కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. వారికీ సేవ చేయడానికి ఇష్టపడతారు. అంతే కాదు ఈ వ్యక్తులు మంచి మాటకారి. తమ మాటలతో అందరినీ సంతోషపరుస్తారు.

నిజం మాట్లాడడానికి ఇష్టపడతారు 9 మూల సంఖ్య ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ నిజం మాట్లాడటానికి ఇష్టపడతారు. ఈ ప్రవర్తన కారణంగా వీరికి చాలా మంది దూరంగా ఉంటారు. అయినప్పటికీ వీరు ఎల్లప్పుడూ సత్యాన్నే సమర్ధిస్తారు. నిజం మాట్లాడే గుణం, ముక్కు సూటి తనం వీరి సొంతం. అంతే కాదు వీరు తమ భాగస్వామితో చాలా సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తారు. ప్రేమిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.