Vastu Tips: స్త్రీలు నిద్రపోయే ముందు ఈ 5 పనులు చేస్తే నెగెటివ్ ఎనర్జీ పోయి ఆనందం, ఐశ్వర్యం పెరుగుతుంది..!
Vastu Tips: హిందూ మతంలో, స్త్రీని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల, స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం. అదే సమయంలో, స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో దుఃఖాల కుప్ప ఉంటుంది. ఇక స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో..
Vastu Tips: హిందూ మతంలో, స్త్రీని లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల, స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం. అదే సమయంలో, స్త్రీలు సంతోషంగా ఉండని ఇంట్లో దుఃఖాల కుప్ప ఉంటుంది. ఇక స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. వీటి ద్వారా ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పేదరికం పోయిన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. అమ్మవారి ఆశీర్వాదం లభిస్తుంది. అయితే, ఇదంతా జరగాలంటే.. స్త్రీలు రాత్రి వేళ నిద్రపోయే ముందు కొన్ని పనులు చేయాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆ పరిహారాలేంటో ఓసారి చూద్దాం.
మహిళలు నిద్రపోయే ముందు ఈ పని చేయాలి..
- వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రి పడుకునే ముందు స్త్రీ కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి. ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది. దీంతో పాటు కుటుంబంలో విబేధాలు కూడా తొలగిపోతాయి. పడకగదిలో కర్పూరాన్ని వెలిగిస్తే భార్యాభర్తల దాంపత్యబంధంలో మధురానుభూతిని కలిగిస్తుంది.
- స్త్రీలు రాత్రి పడుకునే ముందు ఇంటి ముఖద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగించాలి. ఈ పరిహారం చేయడం ద్వారా, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. లక్ష్మీదేవి కూడా సంతోషంగా ఉంటుంది.
- స్త్రీలు నిద్రపోయే ముందు పూజ గదిలో అగరబత్తిని వెలిగించాలి.నిద్రపోయే ముందు చేతులు, కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. కనీసం 5 నిమిషాలు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చేసి నిద్రించాలి.
- సాధారణంగా నిద్రపోయే ముందు ఇంట్లోని లైట్లు అన్నీ ఆఫ్ చేస్తారు. అయితే ఇంట్లో నైరుతి మూల చీకటిగా ఉండకూడదు. అందుకే పడుకునే ముందు ఇక్కడ దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే, ఈ దిశలో చిన్న బల్బును అమర్చండి. ఈ దిక్కున దీపం ఉంటే పూర్వీకులు సంతుష్టులయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..