Broom Vastu Tips: చీపురుని ‘చీప్’గా చూడొద్దు.. చీపురుని ఇంట్లో పెట్టడానికి, శుభ్రం చేయడానికి కూడా నియమాలున్నాయి..
సనాతన ధర్మంలో.. హిందూ సాంప్రదాయంలో చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంది. చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. చీపురు శుభ్రత, సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంది. వాస్తు శాస్త్రంలో చీపురుకు సంబంధించిన అనేక నియమాల గురించి చెబుతుంది. వీటిని విస్మరించడం వల్ల జీవితంలో ఒక వ్యక్తి డబ్బును కోల్పోవలసి ఉంటుంది. ఇంట్లో చీపురు పెట్టుకోవడానికి వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

హిందూ గ్రంధాల ప్రకారం చీపురు లక్ష్మీదేవికి చిహ్నంగా చెప్పబడింది. వాస్తు శాస్త్రం చీపురుకు సంబంధించిన అనేక నియమాల గురించి చెబుతుంది. వీటిని విస్మరించడం వలన జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవచ్చు. ప్రజలు తమ ఇంట్లో ఎక్కడైనా, ఏ విధంగానైనా చీపురును ఉంచుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లో దురదృష్టం, పేదరికం కలుగుతాయి. అటువంటి పరిస్థితిలో ఈ రోజు ఇంట్లో చీపురు ఉంచడానికి వాస్తు నియమాలు ఏమిటో తెలుసుకుందాం..
ఇంట్లో చీపురు ఉంచడానికి నియమాలు
- విరిగిన చీపురును, అరిగిన చీపురుని ఇంట్లో ఎప్పుడూ ఉపయోగించకూడదు.
- చీపురును లక్ష్మీ దేవి రూపంగా భావిస్తారు. కనుక చీపురుపై ఎప్పుడూ కాలు వేయకూడదు.
- ఇంట్లో చీపురును ఎప్పుడూ మురికి చేయకూడదు. మురికిగా ఉంచకూడదు. ఇంట్లో చీపురును పదిమందికి కనిపించేలా పెట్టకూడదు. చీపురుని ఎల్లప్పుడూ దాచి ఉంచాలి.
- ఇంట్లో చీపురును ఎప్పుడూ నిలబెట్టి పెట్టకూడదు. ఇందుకు బదులుగా చీపురుని ఎల్లప్పుడూ పడుకొబెట్టి ఉంచాలి.
- ఇంట్లో మీరు డబ్బు లేదా నగలు ఉంచే ప్రదేశంలో చీపురును ఎప్పుడూ ఉంచవద్దు.
- వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును వంటగదిలో లేదా పడకగదిలో ఎప్పుడూ ఉంచకూడదు.
- అంతేకాదు చీపురును ఇంట్లో బాత్రూమ్ లేదా టాయిలెట్ దగ్గర ఉంచకూడదు.
ఇల్లు ఊడ్చడానికి నియమాలు
- చీపురు విషయంలో మాత్రమే కాదు.. ఇంటిని శుభ్రం చేసే విషయంలో కూడా నియమాలున్నాయి.
- సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయానికి కొంత సమయం ముందు ఊడ్చడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
- వాస్తు నమ్మకాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం అశుభంగా పరిగణించబడుతుంది.
- ఉదయం..ముందుగా ఊడ్చాలి. బ్రహ్మ ముహూర్త సమయంలో ఇల్లుని ఊడ్చడం శుభప్రదంగా భావిస్తారు.
- మొత్తం ఇంటిని శుభ్రం చేసేందుకు ఒక చీపురు, పూజ గదికి వేరే చీపురు ఉండాలి.
పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు
- చీపురును ఎప్పుడూ మురికి చేతులతో లేదా అపరిశుభ్రమైన చేతులతో తాకకూడదు.
- పిల్లలను కొట్టడానికి చీపురును ఎప్పుడూ ఉపయోగించకూడదు.
- చీపురును ఎప్పుడూ కాలు దగ్గర పెట్టుకోకూడదు
- శుక్రవారం, మంగళవారం చీపురు కొనడానికి శుభప్రదమైన రోజులుగా భావిస్తారు.
- శనివారం పాత చీపురును మార్చడానికి మంచి రోజు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








