Astro Tips: జూలై 18 నుంచి మీన రాశిలో తిరోగమనంలో శని.. తులారాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే..
శనీశ్వరుడు జూలై 18వ తేదీ 2025 నుంచి మీన రాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఈ రాశిలో ఆరవ ఇంట్లో ఉంటాడు. ఈ ఇంట్లో అప్పు, వ్యాధి, శత్రువులు, సేవ, దినచర్యకు సంబంధించినది. ఈ సమయంలో కార్యాలయంలో జాప్యాలు, ఆరోగ్య సమస్యలు లేదా పోటీదారులు మిమ్మల్ని పరీక్షించవచ్చు. కనుక ఈ సమయంలో వినయం, సేవ ద్వారా అంతర్గత బలాన్ని పొందవచ్చు. ఈ రోజు శనీశ్వరుడి తిరోగమనం తులారాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

నవ గ్రహాల్లో శనీశ్వరుడికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మందగమనుడైన శనీశ్వరుడు జూలై 18 నుంచి నవంబర్ 30, 2025 వరకు మీన రాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఈ సమయం మొత్తం శనీశ్వరుడు తులారాశి ఆరవ ఇంట్లోనే ఉంటాడు. ఈ ఇల్లు ఆరోగ్యం, బాధ్యతలు, పోరాటం, సేవకు సంబంధించినది. తిరోగమన శని ప్రభావం తో తులారాశి వారు ఇప్పటివరకు విస్మరించిన అంశాలపై దృష్టి పెట్టడానికి ప్రేరేపిస్తుంది. పని నీతి, దినచర్య, జవాబుదారీతనం ఇప్పుడు ఈ రాశి వారికి ప్రధాన అంశాలుగా మారతాయి. జీవితంలోని చిన్న వైనా సరే.. ముఖ్యమైన సవాళ్ల నుంచి వినయాన్ని నేర్చుకోవాల్సిన సమయం ఇది.
కెరీర్: పనిలో వాతావరణం కొంచెం ఉద్రిక్తంగా ఉండవచ్చు. సహోద్యోగులతో అపార్థాలు లేదా విమర్శలను ఎదుర్కోవలసి రావచ్చు. రోజువారీ పనుల ఒత్తిడి కూడా పెరగవచ్చు. శనిశ్వరుడి కోణం ఎనిమిదవ, పన్నెండవ, మూడవ గృహాలపై పడుతోంది. దీంతో ఉద్రిక్తతలు, అంతర్గత భయాలు, కమ్యూనికేషన్ సమస్యలు వెలికి వస్తాయి. ఈ సమయంలో పనిని చేయండి. అంచనాలను స్పష్టంగా నిర్దేశించుకోండి. అనవసరమైన వాదనలను నివారించండి. ఓర్పు, దృఢ సంకల్పంతో వృత్తిపరమైన ఇమేజ్‌ను కాపాడుకోవచ్చు.
ఆర్థికం: ఆరోగ్యం, పెంపుడు జంతువులు లేదా చట్టపరమైన విషయాలపై ఖర్చులు పెరగవచ్చు. ఇది అస్థిరతకు కారణం కావచ్చు. రుణాలు తీసుకోవడంలో లేదా రుణాలు ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండండి. వీలైతే, పాత రుణాలను తిరిగి చెల్లించండి. కొత్తగా అప్పులు చేయవద్దు. మీ ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది మంచి సమయం. శనీశ్వరుడు వాస్తవిక ఆర్థిక బాధ్యతల పాఠాన్ని నేర్పుతున్నాడు.
ఆరోగ్యం: ఏదైనా ఆరోగ్య సమస్యను గతంలో నిర్లక్ష్యం చేస్తే.. అది మళ్ళీ తలెత్తవచ్చు. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ, ఎముకలు, ఒత్తిడి లేదా అలసటకు సంబంధించిన సమస్యలు. శనీశ్వరుడు తులారాశి వారిని క్రమబద్ధమైన, సమతుల్య జీవనశైలిని అవలంబించమని ప్రోత్సహిస్తున్నాడు. సకాలంలో భోజనం, తగినంత నీరు, సాధారణ ఆరోగ్యం తనీఖీ ప్రయోజనకరంగా ఉంటుంది. వైద్యుల సలహా లేకుండా మందులు తీసుకోవద్దు. మీ దినచర్యలో మితమైన వ్యాయామాన్ని చేర్చుకోండి. తద్వారా స్టామినా క్రమంగా పెరుగుతుంది.
కుటుంబం: మీరు కుటుంబ వివాదంలో చిక్కుకోవచ్చు. సంరక్షణకు సంబంధించిన బాధ్యతలు కూడా పెరగవచ్చు. ఈ సమయం సేవా భావంతో సమయం గడపడం నేర్పుతుంది. ఫిర్యాదు చేయడానికి బదులుగా, దానిని ఆధ్యాత్మిక సేవకు అవకాశంగా పరిగణించండి. అయితే పరిమితులను అర్థం చేసుకోండి. ఇతరుల అవసరాలకు అనుగుణంగా అంచనాలను నిర్దేశించుకోండి.
విద్య: పోటీ పరీక్షలు, లా లేదా మెడిసిన్ విద్యార్థులు ఈ సమయం భారంగా అనిపించవచ్చు. అయితే శనీశ్వరుడి క్రమశిక్షణ శక్తిని ఆదర్శంగా తీసుకొని ఒక ప్రణాళికతో ముందుకు సాగితే.. విజయం సాధ్యమవుతుంది. దృష్టి మరల్చే అంశాలను నివారించండి. సృజనాత్మక పనిలో మనస్సును నిమగ్నం చేయండి.
ముగింపు: తులారాశి ఆరవ ఇంట్లో తిరోగమన శని మీకు ఇబ్బందుల నుంచి స్వస్థత పొందే అవకాశాన్ని ఇస్తున్నాడు. రోజువారీ సవాళ్లు సాధారణ విషయాలు కావు. ఆత్మకు సేవ చేయడం కూడా వాటిలో దాగి ఉంటుంది. వ్యతిరేకతలు, అడ్డంకుల పట్ల మీ బాధ్యతాయుతమైన ఆలోచనను పెంపొందించుకోండి. ప్రతికూలతను నివారించండి. రోజువారీ పోరాటాన్ని ఆత్మవిశ్వాసంగా మలచుకోండి.
తులారాశి వారు శనిశ్వరుడి అనుగ్రహం కోసం చేయాల్సిన చర్యలు
- శనివారం,మంగళవారం “హనుమాన్ చాలీసా” పారాయణం చేయండి.
- శనివారం రోజున రావి చెట్టుకు నీళ్ళు అర్పించి, ఏడుసార్లు ప్రదక్షిణ చేయండి.
- అవసరమైన వారికి ఉప్పు, ఆవాల నూనె లేదా నల్ల పప్పు దానం చేయండి.
- మూగ జంతువులకు ఆహారం పెట్టండి లేదా వాటికి ఆహారం అందించే ఏర్పాటు చేయండి.
- రోజువారీ పనులు చేసేటప్పుడు నిశ్శబ్దంగా ఉండండి.. దేవుని పట్ల కృతజ్ఞతగా ఉండండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.








