Roasted or Soaked Chick Peas: కాల్చిన శనగలా లేదా నానబెట్టిన శనగలా? వేటిని తినడం ఆరోగ్యానికి బెస్ట్ అంటే..
ప్రోటీన్, ఫైబర్ సహా అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉన్న శనగలు ఆరోగ్యానికి ఒక వరం వంటివి. ఈ శనగలను వివిధ రకాలుగా అంటే శనగలతో కూరలు, వడలు వంటి ఆహారపదార్ధాలను చేసుకుని మాత్రమే కాదు నానబెట్టిన శనగలు, వేయించిన శనగలు ఇలా వివిధ రకాలుగా తింటారు. అయితే ఆరోగ్యం విషయానికి వస్తే.. ఏవి మంచివి అనే విషయంలో తరచుగా గందరగోళానికి గురవుతారు. కనుక ఈ రోజు వేయించిన శనగలు తినడం మంచిదా లేక రాత్రి నానబెట్టి ఉదయం ఆ శనగలు తినడం ఆరోగ్యకరమైనవా ఈ రోజు తెలుసుకుందాం..

సాయంత్రం వేళ ఆకలి వేస్తే స్నాక్స్ తినాలని కోరుకుంటారు. కొంతమంది ఒక వైపు క్రిస్పీగా, వేయించిన శనగలు (కాల్చిన శనగలు) తినాలని కోరుకుంటే.. మరికొందరు ఆరోగ్య నిధిగా భావించే నానబెట్టిన శనగలు తినాలని కోరుకుంటారు. అయితే ఈ వేయించిన శనగలు, నానబెట్టిన శనగల్లో ఏది మంచిది? వేటిని తినాలని ఆలోచిస్తుంటే.. ఈ ప్రశ్నకు సమాధానం ఈ రోజు తెలుసుకుందాం.. నిజానికి శనగలు అనేవి భారతీయ తాళిలో సూపర్ ఫుడ్. ఇందులో ప్రోటీన్, ఫైబర్ , అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వీటిని తినే విషయంలో రకరకాల పద్ధతులను ఎంచుకుంటారు.
కాల్చిన శనగలు మనం తరచుగా స్నాక్‌గా తినే కాల్చిన శనగలు క్రిస్పీగా, రుచికరంగా ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తాయి. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. వీటిలో ఉండే ప్రోటీన్ శరీరంలోని కండరాలకు మంచిది. ఫైబర్ ఉండటం వల్ల ఇవి జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. అదే సమయంలో బరువు తగ్గాలనుకునే వారికి కాల్చిన శనగలు కూడా మంచి ఎంపిక. ఎందుకంటే వీటిని తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దీంతో ఆకలి వేయదు. అనవసరమైన ఆహారాన్ని తినకుండా నిరోధిస్తుంది.
ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అయితే వీటిని వేయించే ప్రక్రియలో కొన్ని పోషకాలు స్వల్పంగా తగ్గుతాయి. మార్కెట్లో లభించే కాల్చిన శనగల్లో తరచుగా ఎక్కువ ఉప్పు ఉంటుంది. కనుక ఈ కాల్చిన శనగలను తరచుగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
నానబెట్టిన శనగలు మరోవైపు నానబెట్టిన శనగలు ముఖ్యంగా మొలకెత్తిన శనగలు మంచి పోషకాహారం. ఇవి శరీరానికి శక్తివంతమైన కేంద్రంగా మారుతాయి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తినడం మన పురాతన సంప్రదాయంలో భాగం. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. నానబెట్టడం వల్ల శనగాల్లో ఉండే ‘యాంటీ న్యూట్రియంట్స్’ తగ్గుతాయి. తద్వారా మన శరీరం వాటిలో ఉండే పోషకాలను సులభంగా గ్రహించగలదు. ఈ ప్రక్రియ విటమిన్ సి, బి విటమిన్ల స్థాయిలను కూడా పెంచుతుంది.
దీనితో పాటు నానబెట్టిన శనగలు జీర్ణం కావడం కూడా సులభం. ఎందుకంటే ఇవి నానిన తర్వాత మృదువుగా మారతాయి. కడుపు తేలికగా అనిపిస్తుంది. ఇవి గ్యాస్ లేదా ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇవి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వేసవిలో నానబెట్టిన శనగలు తినడం వలన శరీరాన్ని లోపలి నుంచి చల్లగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. అయితే నానబెట్టిన శనగలను లేదా మొలకెత్తిన శనగలు తయారు చేయడానికి కొంచెం సమయం పడుతుంది. అదే సమయంలో వీటిని ఎప్పుడూ తాజాగా తినాలి.
ఆరోగ్యానికి ఏవి మంచివంటే.. ? పోషకాహారం, జీర్ణశక్తి గురించి మాట్లాడుకుంటే.. నానబెట్టిన శనగలు.. ముఖ్యంగా మొలకెత్తిన శనగలు.. వేయించిన శనగ (కాల్చిన శనగల) కంటే కొంచెం మంచివిగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే శనగలను నానబెట్టడం ద్వారా పోషకాలు మన శరీరానికి సులభంగా లభిస్తాయి. మన జీర్ణవ్యవస్థపై కూడా తేలికగా పనిచేస్తాయి. అంటే దీని అర్ధం కాల్చిన శనగలు ఆరోగ్యానికి చెడ్డవని కాదు. ఇవి కూడా చాలా ఆరోగ్యకరమైన చిరుతిండి. ముఖ్యంగా మీరు త్వరగా ఏదైనా తినవలసి వచ్చినప్పుడు.. తక్కువ నూనె, ఉప్పుతో వేయించిన ఈ శనగలు తినడం గొప్ప పోషకహార ఎంపిక అవుతుంది.
వీటిని ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? రెండింటినీ తీసుకోవడం మీకు ఉత్తమ మార్గం. అవును రోజుని ఉదయం నానబెట్టిన లేదా మొలకెత్తిన శనగలతో ప్రారంభించండి. ఇవి రోజంతా శక్తిని ఇస్తాయి. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. అదే సమయంలో, సాయంత్రం లేదా టీతో తేలికపాటి ఆహారంగా తక్కువ ఉప్పు ఉన్న వేయించిన శనగలు తినడం ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎంపిక.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)