Horoscope Today: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. ఆ వివరాలు..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో తొందర పాటుతనంతో వ్యవహరించవద్దు. వృత్తి, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి, ఆదాయ వృద్ధికి సమయం అన్నివిధాలుగానూ అనుకూలంగా ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వ్యాపా రాల్లో అంచనాకు మించి లాభాలు అందిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన మంచి సమాచారం అందుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి ఉంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఆశించిన ప్రోత్సాహకాలు అందుకుంటారు. వృత్తి జీవితంలో తీరిక ఉండదు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా సఫలం అవు తుంది. గట్టి పట్టుదలతో ముఖ్యమైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. రావ లసిన డబ్బు చేతికి అందుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలని స్తాయి. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. కొన్ని ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ సలహాలు, సూచ నల వల్ల అధికారులు ప్రయోజనం పొందుతారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఇతరుల వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నిరుద్యోగులు తప్పకుండా ఆశించిన సమాచారం అందుకుంటారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఉద్యోగ జీవితంలో సానుకూలతలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఎటువంటి లోటూ ఉండకపోవచ్చు. నిరుద్యో గుల ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. మిత్రుల వల్ల ఆర్థిక నష్టం జరిగే సూచనలున్నాయి. అద నపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వ్యక్తిగత సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ముఖ్యంగా సానుకూల మార్పులు, చేర్పులకు అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఉద్యో గపరంగా విదేశీయాన సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలకు ముగింపు పలుకుతారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. సోదరులతో ఆస్తి వివాదం పరిష్కారం అవు తుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, వ్యాపారాల్లో మీరు చేపట్టే మార్పులు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో అధికారులకు మీ సమర్థత మీద నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆర్థిక ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. బంధుమిత్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. మనసులోని కోరికల్లో ఒకటి రెండు నెరవేరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం జరుగు తుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
ఉద్యోగంలో అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ప్రత్యేక బాధ్యతలతో ప్రోత్సహిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వివాహ ప్రయ త్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందే సూచనలున్నాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సంతృప్తికరంగా, సకాలంలో పూర్తవు తాయి. బంధువులతో పెళ్లి కుదరవచ్చు. కుటుంబ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొద్దిగా పని భారం పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులను పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా నెరవేరుతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం నెలకొంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండకపో వచ్చు. ఆర్థిక విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆదాయ వృద్ధికి మార్గాలు విస్తరి స్తాయి. పిల్లల్లో ఒకరికి విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొందరు బంధువులకు ఆర్థి కంగా సహాయం చేస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నిరుద్యోగులు మంచి ఆఫర్ అందుతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వృత్తి, ఉద్యోగాలలో అధికారులతో అదనపు బాధ్యతలతో ప్రోత్సాహిస్తారు. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కార మయ్యే అవకాశముంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు తమకు అందివ చ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవ హారాలన్నీ చక్కబడతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభవార్తలు వింటారు.
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఉద్యోగంలో బాధ్యతల మార్పు చోటు చేసుకుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో రాబడి వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. నిరుద్యోగులకు మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సానుకూలపడతాయి. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. అప్రయత్న ధన లాభానికి అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ప్రయాణాలు లాభి స్తాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.



