Vastu Remedies for Prosperity: సంతోషకరమైన జీవితం కావాలంటే ఈ వాస్తు టిప్స్ తప్పక పాటించండి..!
Vastu Remedies for Prosperity: భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు అనే ఐదు అంశాలతో రూపొందించబడిన వాస్తు నియమాలు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి.
Vastu Remedies for Prosperity: భూమి, ఆకాశం, అగ్ని, గాలి, నీరు అనే ఐదు అంశాలతో రూపొందించబడిన వాస్తు నియమాలు మన జీవితంపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ఈ పంచభూతాల ఆధారంగానే జీవి ఉధ్బవం జరిగింది. ఈ నే పథ్యంలోనే అది ఇల్లు అయినా, మీ శరీరం అయినా.. ఈ ఐదు అంశాలను సమతుల్యం చేయడం అవసరం. ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పోగొట్టి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవడానికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అదృష్టం కోసం వాస్తు చిట్కాలు.. 1. మీ ఇంట్లో ఐశ్వర్యం ఉండాలంటే ముందుగా మీ ఇంటి ముఖ ద్వారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వీలైనంత వరకు వీటిని పాటిస్తే ఎలాంటి అవరోధాలు కానీ, దోషాలు కానీ ఉండవు. 2. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రం చేయాలి. పవిత్రమైన స్వస్తిక్‌ను దానిపై రాయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. 3. పూజా మందిరం కూడా చాలా ముఖ్యమైనది. ఇంట్లో ఎల్లప్పుడూ ఉత్తరం వైపున, తూర్పు వైపున ప్రార్థనా మందిరం ముఖం ఉండేలా చూసుకోవాలి. పూజ గదిలో చనిపోయిన వారి చిత్ర పటాలను పెట్టకూడదు. 4. వాస్తు ప్రకారం దూలం కింద గానీ, మెట్ల కింద గానీ చదువుకోకూడదు. నిద్రించకూడదు. 5. వాస్తు ప్రకారం, డబ్బు ఉన్న అల్మారాను ఎప్పుడూ తెరిచి ఉంచవద్దు. దాని దగ్గర చీపురును ఉంచవద్దు. చీపురు ఎల్లప్పుడూ కనిపించకుండా ఉండాలి. 6. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంట్లో అనవసరమైన, పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు. దీని కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది.
చెట్ల పెంపకం కూడా.. మొక్కల ద్వారా కూడా ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వెదురు మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఆనందం పెరుగుతుందని విశ్వాసం. అలాగే, మనీ ప్లాంట్ ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఔషధ, దైవిక గుణాలతో నిండిన తులసి మొక్కను నాటడం ద్వారా కూడా అద్భుత ప్రయోజనాలు లభిస్తాయి. తులసి మొక్క ఇంటికి సంబంధించిన అన్ని వాస్తు దోషాలను తొలగిస్తుందని విశ్వాసం. తులసి మొక్క వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇంట్లో పాలు, ముళ్ళతో కూడిన మొక్కలను ఎప్పుడూ నాటొద్దు.
Also read: